హోమ్ /వార్తలు /crime /

రోడ్డు పక్కన చెత్తు కుప్పలో నగ్నంగా మహిళ మృతదేహం.. మూట విప్పిచూసి పోలీసులు షాక్

రోడ్డు పక్కన చెత్తు కుప్పలో నగ్నంగా మహిళ మృతదేహం.. మూట విప్పిచూసి పోలీసులు షాక్

Viral News: ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి స్థానికులందరికీ తెలిసింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యారు.

Viral News: ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి స్థానికులందరికీ తెలిసింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యారు.

Viral News: ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి స్థానికులందరికీ తెలిసింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యారు.

  అది బిజీగా ఉండే రోడ్డు. దాని పక్కన ఓ చెత్త కుప్ప ఉంది. అందులో అనుమానాస్పద స్థితిలో ఓ ప్యాకేజీ కనిపించింది. ఒక మనిషి మృతదేహాన్ని కవర్‌లో చుట్టి అక్కడ పడేశారు. ఆ మూటను చూసి స్థానికులు వణికిపోయారు. చుట్టుపక్కల వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది. దాని దగ్గరకు వెళ్లేందుకు కూడా భయపడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మరి అక్కడ పడి ఉన్న మృతదేహం ఎవరిది? ఎవరు తీసుకొచ్చి పడేశారు..?

  మలేషియాలోని షాఆలమ్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ మృతదేహాన్ని చెతకుప్పలో పడేసినట్లు ఓ వ్యక్తి ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టి అక్కడ పడేసినట్లు పోలీసులకు వివరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి స్థానికులందరికీ తెలిసింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు జనం పెద్ద ఎత్తున పోగయ్యారు. రోడ్డుకు అవతలి వైపున నిలబడి చెత్తకుప్ప వైపే చూస్తున్నారు. పోలీసుల కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని సీల్ చేసి.. ఎవరూ రాకుండా జాగ్రత్త పడ్డారు. చుట్టూ పోలీసులు మోహరించారు. ఆమె ఎవరు? ఎలా చనిపోయిందని తెలుసుకునేందుకు స్థానికులు ఆసక్తి కనబరించారు. పెద్ద ఎత్తున జనాలు.. పోలీసుల మోహరింపుతో.. అక్కడ హడావిడి నెలకొంది.

  ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు..ఈసారి మగపిల్లాడు పుడతాడని గర్భిణి తలలో మేకు దించిన నకిలీ బాబా

  చివరకు పోలీసులు ఆ ప్లాస్టిక్ కవర్‌ని విప్పి చూసి షాక్ తిన్నారు. ఎందుకంటే అందులో మహిళ మృతదేహం లేదు. అది సెక్స్ డాల్. మహిళా సెక్స్ డాల్ బయటపడడంతో అక్కడున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. సిగ్గుతో తలదించుకున్నారు. పోలీసులు వెంటనే.. ఆ సెక్స్‌డాల్‌ను కప్పేసి.. అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అనంతరం స్థానికులను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ ఘటనపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. చెత్త కుప్పలో మృతదేహం ఉందని ఓ వ్యక్తి తమకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారని.. తాము అక్కడికి వెళ్లి చేస్తే.. అది శవం కాదని తెలిపారు. అందులో సెక్స్ డాల్ బయటపడిందని వివరించారు. రాత్రి సమయంలో ఎవరో ఆ బొమ్మను తీసుకొచ్చి రోడ్డుపై పడేసి ఉంటారని పేర్కొన్నారు.

  పురుషులు లేని ఊరు.. 30 ఏళ్లుగా అంతే.. కానీ మహిళలకు గర్భం ఎలా వస్తోంది..?

  మలేసియాలో రోడ్డు పక్కన చెత్తను పడేసే ఘటనలు ఇటీవల ఎక్కవయ్యాయి. ఎవరూ లేకుండా రోడ్డు పక్కన ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అక్కడ చెత్తా చెదారం వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తులు సెక్స్ డాల్‌ను పడేశాడు. దానిని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేయడంతో.. శవమని స్థానికులు ఆందోళన చెందారు. ఐతే అక్కడ ఆ బొమ్మను ఎవరు పడేశారో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు.

  First published:

  ఉత్తమ కథలు