హోమ్ /వార్తలు /క్రైమ్ /

ముంబైలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ఫ్లాట్ జప్తు

ముంబైలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ఫ్లాట్ జప్తు

దావుద్ ఇబ్రహీం (ఫైల్ ఫోటో)

దావుద్ ఇబ్రహీం (ఫైల్ ఫోటో)

దావూద్ ఇబ్రహీంకు మొత్తం 11 మంది తొబుట్టువులు. అందులో హసీనా పార్కర్ అందరికన్నా చిన్నది. దావూద్ యొక్క అత్యంత నమ్మకస్తుల్లో ఆమె ఒకరు.

  మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి ఇంటిని జప్తు చేశారు అధికారులు. సౌత్ ముంబైలో శుక్రవారం హసీనా పార్కర్ నివాసముండే ఫ్లాట్ నాగ్పాడ ఇంటిని వేలం వేశారు. స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మ్యానిపలేటర్స్ చట్టం కింద ఇంటిని రూ.1.80 లక్షల ధరకు జప్తు చేశారు. పార్కర్ బంధువులు ఇల్లు తమదేనని రుజువు చేయడంలో చట్టపరమైన ఆధారలు సమర్పించడంలో విఫలమయ్యారు. దీంతో అధికారులు పార్కర్ ఇంటిని వేలం వేశారు. దావూద్ దేశం విడిచి వెళ్లిన తర్వాత అతని తల్లి అమీన, సోదరి హసీనా దావూద్ ఆస్తుల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. అయితే 2018లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ముంబైలోని ఆస్తులను వెంటనే జప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆస్తుల స్వాధీనంపై దావూద్ తల్లి అమినా బీ కస్కర్, సోదరి హసీనా పార్కర్ వేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించింది.


  దావూద్ ఇబ్రహీంకు మొత్తం 11 మంది తొబుట్టువులు. అందులో హసీనా పార్కర్ అందరికన్నా చిన్నది. దావూద్ యొక్క అత్యంత నమ్మకస్తుల్లో ఆమె ఒకరు. దావూద్ తర్వాత గూఢచార సంస్థలతో ఆమె టచ్‌లో ఉండేది. రోజువారీ కార్యక్రమాలన్నీ సన్నిహిత పరిశీలనను ఉంచింది. హసీనా పార్కర్ భర్తను దావూద్ శతృవు అరుణ్ గ్వాలి దారుణంగా హత్య చేశాడు. భర్త మరణం తర్వాత ఆమె ఇస్మాయిల్ పార్కర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన సోదరుడు నడిపిన రూ.5000 కోట్ల నేర సామ్రాజ్యం బాధ్యతలు తీసుకుంది హసీనా పార్కర్.


  1995లో దావూద్ ముంబైలోని జేజే హాస్పిటల్‌లో హసీనా భర్తను చంపిన అరుణ్‌ను దావూద్ అంతమొందించాడు. ప్రస్తుతం కోర్టు జప్తు చేసిన నాగ్‌పద ఫ్లాట్‌లోనే 1993లో దావూద్ కొన్నాళ్లు ఉన్నాడు. హసీనా పార్కర్ కూడా తన చివరి రోజుల్లో ఇదే ఇంటిలో గడిపారు. 55 ఏళ్ల వయస్సులో ఆమె నాగ్‌పద ప్లాట్‌లోనే కన్నుమూశారు. 2014 జూన్ 7 హసీనా పార్కర్ చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారే తల్లిని చూసుకునేవారు. హసీనా కడుకు దానిష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేస్తున్న సమయలో హసీనాకు అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆమె చివరిశ్వాస విడిచింది.

  First published:

  Tags: Crime, National News, Supreme Court

  ఉత్తమ కథలు