ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ లండన్ జైలులో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బీ గ్రేడ్ జైలుకు తరలించారని వాపోతున్న నీరవ్ మోడీకి, లండన్ సౌత్-వెస్ట్ జైలు అధికారులు మరో షాక్ ఇచ్చారు. నీరవ్ మోడీ తనకు జైలులో ప్రత్యేక సెల్ కావాలని అధికారులను కోరగా, అలా కుదరదని జైలు సిబ్బంది తేల్చి చెప్పేసింది. జైలులో సహ ఖైదీలతో కటకటాల గది పంచుకోవాల్సిందేనని నీరవ్‌కు తెలిపారు. అయితే నీరవ్‌తో పాటు జైలులో సెల్ ను పంచుకుంటున్న వారిలో అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనుచరుడు జబీర్ మోటీ కూడా ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఖైదీగా రిమాండ్ లో ఉన్న జబీర్ మోటీ పలు కేసుల్లో ఇరుక్కొని లండన్ జైలులో ఉన్నారు. దావూద్ అనుచరులతో నీరవ్ మోడీ జైలు గది పంచుకోవాల్సి వచ్చింది.
ఇక నీరవ్ మోడీ ఉంటున్న సౌత్ వెస్ట్ లండన్ జైలు చరిత్రలోకి వెళితే 1851లో ఈ జైలును నిర్మించారు. లండన్ లోని అత్యంత రద్దీ ఉన్న జైళ్లలో ఈ జైలు ఒకటి. ప్రస్తుతం ఈ జైలులో మొత్తం 1428 మంది ఖైదీలు ఉంటున్నారు. అయితే ప్రస్తుతం సామర్థ్యానికి మించి ఖైదీలను ఈ జైలులో ఉంచుతున్నారు. డ్రగ్ మాఫియాకు చెందిన ప్రధాన నేరస్తులను ఈ జైలులో నిర్బంధిస్తున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.