Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Dawood Ibrahim: కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌తో దావూద్ ఇబ్రహీం‌కు లింకులు: ఎన్ఐఏ

    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ కొనసాగిస్తుంది. ఈ బంగారం అక్రమ రవాణాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ హస్తం ఉన్నట్టుగా ఎన్‌ఐఏ భావిస్తోంది.

    news18-telugu
    Updated: October 15, 2020, 1:11 PM IST
    Dawood Ibrahim: కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌తో దావూద్ ఇబ్రహీం‌కు లింకులు: ఎన్ఐఏ
    దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim)
    • Share this:
    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ కొనసాగిస్తుంది. ఈ బంగారం అక్రమ రవాణాలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం, డీ గ్యాంగ్ హస్తం ఉన్నట్టుగా ఎన్‌ఐఏ భావిస్తోంది. ఈ మేరకు కొచ్చిలోని ప్రత్యేక న్యాయస్థానం ఎన్‌ఐఏ వాదనలు వినిపించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పలుమార్లు దావూద్ ఇబ్రహీం విస్తృతమైన టాంజానియా వెళ్లివచ్చాడని కోర్టుకు తెలిపింది. "ఈ కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న ఏ-5 రమీజ్‌ను విచారించినప్పుడు అతను పలు విషయాలను వెల్లడించాడు. అతడు టాంజానియాలో డైమండ్ ప్రారంభించాలని ప్రయత్నించినట్టు తెలిపాడు. అలాగే గోల్డ్ మైనింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నాలు జరిపినట్టు చెప్పాడు. టాంజానియా నుంచి బంగారం తెచ్చి యూఏఈలో అమ్మినట్టు వెల్లడించాడు" అని ఎన్‌ఐఏ తెలిపింది.

    మహమ్మద్ షఫీ అనే వ్యక్తి ఈ బంగారం అక్రమ రవాణాలో ప్రధాన సూత్రదారుడిగా ఉన్నాడని.. రమీజ్‌తో కలిసి 2019 నవంబర్ నుంచి ఈ విధంగా అక్రమణ రవాణాకు పాల్పడుతున్నాడని తెలిపింది. వీరు యూఏఈ కాన్సులేటు నుంచి డిప్లమేటిక్ బ్యాగేజ్ ద్వారా 21 సార్లు బంగారం అక్రమంగా తరలించారని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ భద్రకు ముప్పు కలిగించే ఉద్దేశంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. దౌత్య మార్గాల ద్వారా గోల్డ్‌ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఈ కేసులో నిందితులకు బెయిల్‌ ఇవ్వరాదని న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేసింది.

    ఇక, జూలై 5వ తేదీన యూఏఈ నుంచి దౌత్య మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బంగారాన్ని కొచ్చి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలిస్తున్న బంగారం విలువ 14.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. డిప్లమాటిక్ కార్గో ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బంగారం తరలించడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థలు ఎన్‌ఐఏ, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్‌లు విడివిడిగా విచారణ చేపట్టాయి. ఈ కేసకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేటులో మాజీ ఉద్యోగులైన స్వప్న సురేష్‌, పీఎస్ సరిత్‌తో పాటు మరికొందరు నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అయితే ఈ కేసులో స్వప్న సురేష్ పేరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధాన కార్యదర్శికి ఎం శివశంకర్‌కు ఆమెతో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయనను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక, ఇటీవల ఆమెకు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ.. పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తికానందున్న ఆమె విడుదల కాలేదు.
    Published by: Sumanth Kanukula
    First published: October 15, 2020, 1:10 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading