రోజురోజుకు మానవ సంబంధాలు మరింత దిగజారిపోతున్నాయి. వావివరసలు మరిచి మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. వరసలు మరిచి పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. చివరకు చేజేతులా వారి జీవితాల్ని వాళ్లే బలి తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పాజిపేట గ్రామంలో కల్లూరి సత్యమ్మ అనే 55 ఏళ్ల మహిళ.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవిస్తుంది. ఆమెకు భర్త లేడు. దీంతో సత్యమ్మ కొంతకాలంగా యాదయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల తరువాత ఆమె చిన్నమ్మాయిని రుద్రమ్మను కూడా అతడికి పరిచయం చేసి... అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా ప్రోత్సహించింది సత్యమ్మ.
కొంతకాలం తరువాత యాదయ్యను చిన్నకూతురు రుద్రమ్మకు ఇచ్చి పెళ్లి కూడా చేసింది. యాదయ్య కారణంగా రుద్రమ్మకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే, తల్లితో భర్తకు ఉన్న అక్రమ సంబంధం కారణంగా యాదయ్య, రుద్రమ్మ మధ్య నిత్యం గొడవలు పడేవారు. ఇక తల్లితో కలిసి ఉండటం ఇష్టం లేక చిన్నకూతురు అక్కడి నుంచి వచ్చి నగర శివార్లలో ఉన్న చౌటుప్పల్ కు వచ్చేసి ఒంటరిగా ఉంటోంది. దీంతో యాదయ్య ఆమె తల్లిపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన రుద్రమ్మ తన అక్క ఆండాలుతో కలిసి జంగయ్య అనే వ్యక్తిని 20వేల రూపాయలు డబ్బులు ఇచ్చి తల్లిని హత్య చేయించారు. ఆ ఇంట్లో ఉన్న డబ్బును తీసుకొని ఉడాయించారు. పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. తల్లి చేసిన పనులను తట్టుకోలేకనే ఇలా చేసినట్టు ఆమె కూతుళ్లు ఆండాలు, రుద్రమ్మలు తెలిపారు. కేసు విచారణలో బయటపడ్డ నిజాలు విని పోలీసులు సైతం షాక్ తిన్నారు. ఇద్దరు కూతుళ్లపై కేసు నమోదు చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.