DAUGHTER OPPOSES MOTHER EXTRA MARITAL AFFAIR FINALLY IT RUINS 20 YEAR OLD GIRL LIFE SSR
Mother Affair: తల్లి వివాహేతర సంబంధం.. 20 ఏళ్ల వయసున్న కూతురికి ఊహించని కష్టం..
బాధితురాలు
వివాహేతర సంబంధాల మూలంగా అనర్థాలు తప్పవని రుజువు చేసే ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా కొందరి తీరు మారడం లేదు. ఫలితంగా వివాహేతర సంబంధానికి సంబంధించి రోజుకొక నేరం, ఘోరం జరుగుతూనే ఉంది.
మెహసన: వివాహేతర సంబంధాల మూలంగా అనర్థాలు తప్పవని రుజువు చేసే ఘటనలు రోజుకొకటి వెలుగుచూస్తున్నా కొందరి తీరు మారడం లేదు. ఫలితంగా వివాహేతర సంబంధానికి సంబంధించి రోజుకొక నేరం, ఘోరం జరుగుతూనే ఉంది. అఫైర్ నడుపుతున్న వారితో పాటు వారి ఇంట్లో వ్యక్తులు కూడా చేయని పాపానికి బలయిపోతున్నారు. గుజరాత్లోని మెహసనలో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. తల్లి వివాహేతర సంబంధానికి 20 ఏళ్ల కూతురు అన్యాయంగా బలైపోయింది. తల్లితో వివాహేతర సంబంధం నడుపుతున్న వ్యక్తే ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్కు చెందిన ఓ కుటుంబం మెహసనలో ఉంటోంది. భార్యాభర్తలు, వారి కూతురు ఉండేవారు. ఆ కూతురి వయసు 20 సంవత్సరాలు. ఆ యువతి తండ్రికి పరేష్ జోషి అనే స్నేహితుడు ఉన్నాడు. అతనితో ఉన్న స్నేహం కొద్దీ సదరు యువతి తండ్రి అతనిని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ సమయంలోనే పరేష్ జోషికి, యువతి తల్లి కామినికి పరిచయం ఏర్పడింది. భర్తకు తెలియకుండా కామిని, పరేష్ జోషి ఫోన్లో మాట్లాడుకునేవారు. భర్త ఇంట్లో లేనప్పుడు పరేష్ ఏకంగా ఆ మహిళ ఇంటికి వెళ్లేవాడు. కామిని కూడా పెళ్లీడుకొచ్చిన కూతురు ఇంట్లో ఉందన్న స్పృహ కూడా లేకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని అతనితో రాసలీలలు సాగించేది. ఇలా తన తల్లిని ఆ వ్యక్తి కలవడం బాధిత యువతికి నచ్చేది కాదు. పలు సందర్భాల్లో తల్లితో, ఆమె ప్రియుడితో గొడవ పెట్టుకుంది. ఈ పరిణామం ఆమె తల్లికి, ప్రియుడికి ఇబ్బందిగా అనిపించింది. ఆ యువతి తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన పరేష్ జోషి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 28న ఆ యువతిని పని ఉందని, కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.
ఖారీ బ్రిడ్జి కిందకు తీసుకెళ్లి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు. రాత్రి 8.30 సమయంలో ఈ ఘటన జరిగింది. అసలు విషయం తెలియని యువతి తండ్రి తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ యువతి ఫొటోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసి ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలని కోరారు. మరోపక్క నాలుగు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం వెతుకులాట సాగించారు. నవంబర్ 30న బైపాస్ రోడ్ పక్కన బ్రిడ్జి కింద ఓ యువతి సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఆ యువతి పెట్టుకున్న బ్రాసిలెట్, రిస్ట్ వాచ్, చేతి వేలికి పెట్టుకున్న రింగ్ చూసిన ఆమె తండ్రి ఆ మృతదేహం తన కూతురిదేనని గుర్తుపట్టాడు. పోలీసులు ఎవరిపై అయినా అనుమానం ఉందా అని ప్రశ్నించగా.. పరేష్పై అనుమానం ఉందని చెప్పాడు. అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. తమ వివాహేతర సంబంధాన్ని సదరు యువతి వ్యతిరేకించిందని.. ఎక్కడ విషయం బయటకు పొక్కుతుందోనన్న కారణంతోనే ఆమెను చంపేసినట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.