హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఫోన్ దాచిపెట్టాడనే కోపంతో.. తల్లి సాయంతో కన్నతండ్రినే కడతేర్చిన కూతురు...

ఫోన్ దాచిపెట్టాడనే కోపంతో.. తల్లి సాయంతో కన్నతండ్రినే కడతేర్చిన కూతురు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కూతురు జీవితాన్ని బుగ్గి పాలు చేయొద్దనే ఉద్దేశంతో.. ఆ పెళ్లి తనకు ఇష్టం లేకున్నా ఘనంగా వివాహం చేశాడా తండ్రి.. కానీ ఇన్ని చేసినా ఆ కూతురు మాత్రం కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసింది.

 • News18
 • Last Updated :

  కూతురును అల్లారుముద్దుగా పెంచాడాయన. తనకు బిడ్డే సర్వస్వం అనుకున్నాడు. తనకు అడిగినవన్నీ కొనిచ్చాడు. ఆఖరకు ఆమె తనకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ముందు ఆ తండ్రి ఒప్పుకోలేదు. కానీ కూతురు పట్టుబట్టింది. పెళ్లి చేయకుంటే చచ్చిపోతా అని బెదిరించింది. చేతులారా పెంచిన కూతురు జీవితాన్ని బుగ్గి పాలు చేయొద్దనే ఉద్దేశంతో.. ఆ పెళ్లి తనకు ఇష్టం లేకున్నా ఘనంగా వివాహం చేశాడా తండ్రి.. కానీ ఇన్ని చేసినా ఆ కూతురు మాత్రం కన్నతండ్రినే అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఈ ఘటన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుందీ ఘటన. బిలాస్ పూర్ జిల్లా కంచన్ పూర్ లో ఆదివారం వెలుగుచూసింది. కంచన్ పూర్ కు చెందిన మంగ్లు రామ్ కు ఒక కూతురు. ఆమె పేరు సరస్వతి. గతేడాదే ఆమెకు పెళ్లి చేశాడు రామ్. కానీ ఆ పెళ్లి తనకు ఇష్టం లేదు. కాగా.. ఈ నెల23న అల్లుడు వచ్చి సరస్వతిని ఇంట్లో దింపి వెళ్లాడు. ఆ మరుసటి రోజు సరస్వతి ఫోన్ కనిపించలేదు. దీంతో ఆమె కంగారుగా అటూ ఇటూ తిరిగింది. అమ్మను, నాన్నను అడిగింది. కానీ వాళ్లు తమకు తెలియదని చెప్పారు.

  కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు గానూ మంగ్లు రామే ఫోన్ ను దాచానని చెప్పుకొచ్చాడు. దీంతో సరస్వతి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎంత అడిగినా తన తండ్రి ఫోన్ ఇవ్వకపోయే సరికి.. అక్కడే ఉన్న పెద్ద కర్రలను తీసి నాన్న పై మోదింది. దీంతో ఆయన ఉన్న మనిషి ఉన్నట్టుగానే అక్కడ కింద పడిపోయాడు. అంతటితో సరస్వతి కోపం చల్లారలేదు. అదే కర్రతో తండ్రి తలపై బాదుతూనే ఉంది. దీంతో ఆ తండ్రికి తీవ్ర రక్తస్రావమై.. అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు.

  మరణించిన మృతదేహాన్ని ఇంటి శివారులో ఉన్న పెరడులో కాల్చేసింది సరస్వతి. దీనికి ఆమె తల్లి కూడా సహకరించింది. అయితే పొరుగును ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగాన్నంతా చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తల్లీ కూతుళ్ల బండారం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Bilaspur S26p05, Chhattisgarh, Crime, Crime news, Murder, Phone

  ఉత్తమ కథలు