ప్రాణాలు తీసిన ప్రేమ వివాహం... కూతురి కోసం తండ్రి...

మనం రెగ్యులర్‌గా వింటుంటాం... కూతురు ఎవర్నో ప్రేమిస్తే... తట్టుకోలేక ఆమెను చంపేయడమో, లేక అతన్ని లేపేయడమో చేస్తుంటారు కొందరు పేరెంట్స్. ఈ కథ అలాంటిది కాదు. కూతురి కోసం ఆ తండ్రి ఏం చేశాడో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: August 3, 2019, 8:25 AM IST
ప్రాణాలు తీసిన ప్రేమ వివాహం... కూతురి కోసం తండ్రి...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: August 3, 2019, 8:25 AM IST
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది దయానంద్ కూతురు దీపు. రోజూ రెగ్యులర్‌గా ఉద్యోగానికి వెళ్తున్న ఆమె... అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుణ్ని ప్రేమించింది. అతనిది పశ్చిమ గోదావరి జిల్లా... పాలకొల్లు. అతను కూడా ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. విషయాన్ని తన తండ్రికి చెప్పింది దీపు. ఎందుకో ఆయనకు ఆ కుర్రాడు నచ్చలేదు. పెళ్లికి ఒప్పుకోలేదు. తండ్రి నిర్ణయం ఆమెకు నచ్చలేదు. ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఇద్దరం ఇష్టపడ్డాం... పెళ్లి చేసుకుంటే తప్పేంటి అనుకుంది... నాన్న ఎందుకు అడ్డుపడుతున్నారు అని ఆలోచించింది. చివరకు తన నిర్ణయమే కరెక్ట్ అనుకుంది. ఇద్దరూ కలిసి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇద్దరం మేజర్లమే కాబట్టి... తమ పెళ్లి చెయ్యాలని కోరారు.

చట్టప్రకారం వ్యవహరించిన పోలీసులు... దయానంద్‌ను స్టేషన్‌కి పిలిచారు. వాళ్ల పెళ్లికి అడ్డుచెప్పడం కరెక్టు కాదన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. చేసేది లేక దయానంద్ పెళ్లికి ఒప్పుకున్నాడు. కాకపోతే... ఓ నెల పాటూ గడువు కోరాడు. పెళ్లంటే చిన్న విషయం కాదనీ... చేయాల్సిన పనులు చాలా ఉంటాయని కూతురితో అన్నాడు. తండ్రిపై ఆమెకు నమ్మకం పోయింది. తమను దూరం చెయ్యడానికే టైమ్ అడిగారని అనుకుంది. వెంటనే పెళ్లి జరగాల్సిందే అని చెప్పింది. అంతే... పోలీస్ స్టేషన్ నుంచీ సైలెంట్‌గా వెళ్లిపోయాడు దయానంద్.

శ్రీకాళహస్తి ఆలయంలోని గోశాలలో క్లర్క్‌గా పనిచేస్తున్న దయానంద్... కూతురు తన మాట కాదందనీ, విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి పరువు పోయిందని భావించాడో ఏమోగానీ... తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి విషయంలో జరిగిన తంతుతో కన్న తండ్రి చనిపోవడంతో... ఇప్పుడు దీపుతోపాటూ... కుటుంబ సభ్యులంతా కన్నీరు పెడుతున్నారు.

First published: August 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...