Home /News /crime /

DAUGHTER LOVE MARRIAGE LEADS TO HER PARENTS SUICIDE AND THE INCIDENT HAPPEND IN KARNATAKA SSR

Love Marriage: ఇంట్లో నుంచి వెళ్లిపోయి కూతురి ప్రేమ పెళ్లి.. లోకాన్నే వదిలివెళ్లిపోయిన తల్లిదండ్రులు..

రమేష్, శ్యామల (ఫైల్ ఫొటో)

రమేష్, శ్యామల (ఫైల్ ఫొటో)

రమేశ్(50), ఆయన భార్య శ్యామల(42) గారాల కూతురే శిల్ప(21). చిన్నప్పటి నుంచి కూతురిని ఎంతో అపురూపంగా పెంచారు. రమేశ్ తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శిల్పకు తమ గ్రామానికే చెందిన పునీత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది.

ఇంకా చదవండి ...
  బెంగళూరు: ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఇద్దరూ మేజర్లు కావడంతో ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కులాలు కూడా ఒకటే కావడంతో తమ ప్రేమకు పెద్దల అంగీకారం ఉంటుందనుకున్నారు. కానీ.. ఆ యువకుడు యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. అతనిని అల్లుడిగా చేసుకునేందుకు ససేమిరా అన్నారు. అయితే.. చావైనా, బతుకైనా అతనితోనే అని ఆ యువతి కూడా తేల్చి చెప్పింది. ఇంట్లో ఇలా గొడవలు జరుగుతుండగానే ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆ యువకుడితో కలిసి వెళ్లిపోయింది. ఒప్పించాలని ప్రయత్నించామని, కానీ.. వాళ్లు అభ్యంతరం తెలిపారు కాబట్టి తాము చేసింది తప్పు కాదని వాళ్లను వాళ్లు సముదాయించుకున్నారు. ఇద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి, అమ్మాయిది ఒకే ఊరు కావడంతో ఈ విషయం తెలిసి ఆ యువతి తల్లిదండ్రుల గుండె పగిలింది. ఫలానా వాళ్లమ్మాయి ఓ కుర్రాడితో లేచిపోయిందని ఊళ్లో జనం కథలుకథలుగా చెప్పుకుంటున్నారన్న సంగతి తెలిసి ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందారు. ఆ బాధతోనే క్షణికావేశంలో ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం విషాదాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి వల్లే పరువు పోయిందని భావించిన తల్లిదండ్రులు అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చెన్నపట్టణ తాలూకా తెంకనహళ్లిదొడ్డి అనే గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రమేశ్(50), ఆయన భార్య శ్యామల(42) గారాల కూతురే శిల్ప(21). చిన్నప్పటి నుంచి కూతురిని ఎంతో అపురూపంగా పెంచారు. రమేశ్ తనకు ఉన్న పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. శిల్పకు తమ గ్రామానికే చెందిన పునీత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. ఆ స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాలకు అభ్యంతరం తెలిపే అవకాశం కూడా లేదని శిల్ప, పునీత్ భావించారు.

  పెద్దలకు తెలియకుండా ఇద్దరూ గంటల కొద్దీ కాల్స్ మాట్లాడుకునేవారు. వాట్సాప్‌లో రోజూ సంభాషించుకునేవారు. ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగిన శిల్ప, పునీత్ ఇరు కుటుంబాలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పునీత్ కుటుంబం పెళ్లికి అడ్డుచెప్పకపోయినప్పటికీ, శిల్ప కుటుంబం మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఆ కుర్రాడికి గ్రామంలో అంత మంచి పేరు లేదని, అతనిని పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని శిల్పకు ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ శిల్ప పెళ్లంటూ చేసుకుంటే పునీత్‌నే చేసుకుంటానని తెగేసి చెప్పింది.

  ఈ విషయంలో శిల్పకు, ఆమె తల్లిదండ్రులకు మధ్య చిన్నచిన్న గొడవలు కూడా జరిగాయి. ఇక.. తన తల్లిదండ్రులు ఒప్పుకోరని ఓ నిర్ణయానికొచ్చిన శిల్ప ప్రియుడు పునీత్‌తో కలిసి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని భావించింది. పునీత్ కూడా అందుకు సరే అనడంతో ఇద్దరూ మే 30న ఇళ్ల నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం గురించి ఊళ్లో తెలిసి.. ఈ ఇద్దరి ప్రేమ పెళ్లి గురించి ఊళ్లో రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నలుగురిలో పెద్ద మనిషిలా రోజూ కలివిడిగా తిరిగే శిల్ప తండ్రి రమేష్‌కు తలతీసేసినట్టు అయింది.

  అందరూ తన కూతురి గురించే మాట్లాడుకుంటున్నారని.. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్నానని భార్య శ్యామలకు చెప్పాడు. కుటుంబం పరువు పోయిందని భావించిన ఈ దంపతులు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం తమ మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో తెంకనహళ్లిదొడ్డి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శిల్ప, పునీత్‌లను ఊళ్లో అడుగుపెట్టనివ్వకూడదని గ్రామస్తుల తీర్మానించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Karnataka, Lovers, Parents died, Suicide

  తదుపరి వార్తలు