DAUGHTER IN LAW BEATING HER AUNT FOR EATING TOO MUCH BREAD VIDOE VIRAL SNR
vidoe viral:ఒక రొట్టె ఎక్కువ తిన్నందుకు కోడలు అత్తకిచ్చిన పనిష్మెంట్ ఇదే
Photo Credit:Youtube
Haryana: అత్తాకోడళ్లు అంటే ఒకరంటే మరొకరికి పడదు. ఇది చాలా చోట్ల ఉండే కథే. కాని హర్యానాలో కేవలం ఓ చిన్న కారణంతో అత్తను మూడ్రోజులుగా కోడలు కొడుతూనే ఉంది. ఎందుకు కొడుతుందో పోలీసులకు తీసిన తర్వాత ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది.
ముసలి వాళ్లకైనా ఓపిక ఉన్నంత వరకే భరిస్తారు. తింటి పెట్టకుండా ..ఇంట్లో ఉంటున్నారు కదా అని అవమానిస్తే ఎదురు తిరుగుతారు. హర్యానా(Haryana)లో ఓ వృద్ధురాలైన అత్తను కోడలు కొట్టింది. ఓ చిన్న సాకును అడ్డుపెట్టుకొని రోజు కొడుతూ ఉండటం చుట్టు పక్కల వాళ్లు చూసి తమ సెల్ఫోన్లలో రికార్డ్ చేశారు. పెద్దావిడపై కోడలు (Daughter in law)ఎందుకు అంతలా దాడి చేసిందని తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. సోనిపట్( Sonipat)జిల్లాలోని సందల్ఖుర్ధ్ (Sandalkhurdh) గ్రామానికి చెందిన 75సంవత్సరాల(75Years old) వృద్ధురాలు కొడుకు దగ్గర ఉంటోంది. వృద్దురాలైన అత్తకు మనీషా (Manisha)అనే కోడలు ఉంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కో రొట్టె ఇస్తుండేది. మూడ్రోజుల క్రితం మనవడు ఒక రొట్టెని తీసుకొచ్చి నాయనమ్మకి ఇచ్చి తినమని బలవంతం చేయడంతో తినేసింది. అది చూసిన కోడలు తన కొడుకు దగ్గరున్న రొట్టెను కూడా లాక్కొని తింటావా నీకు పెట్టేది సరిపోవడం లేదా అని కోపంతో వృద్దురాలిపై దాడి చేసింది. ఇష్టం వచ్చినట్లుగా కొట్టడం, చేతులతో నెట్టేయడం చేసింది. కోడలు వరుసగా రెండో రోజు కూడా అదే రొట్ట విషయంలో మరోసారి కొట్టడంతో కొడుకు సమయానికి వచ్చి అడ్డుపడ్డాడు. ఇంట్లో కోడలు టార్చర్ భరించలేకపోయిన అత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒక్క రొట్టె తిన్నందుకు ఎంత రాద్దాంతం..
కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా వారికి అందిన వీడియోలు పరిశీలించారు. అందులో కోడలు అత్తను కొట్టడం, తిడుతూ ఉండటంతో కొడుకు, కోడలు మనీషాతో పాటు ఆమె సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
(అత్తను కొట్టిన కోడలు)
అత్తను చితకబాదిన కోడలు..
తనపైనే అత్త పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని తట్టుకోలేకపోయింది మనీషా. దీనికి తోడు భర్త కూడా తల్లిని భార్య కొట్టడాన్ని వ్యతిరేకించడంతో కోడలు మరోసారి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించబోయింది. దీంతో మనీషాపై భర్త, అత్త జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తన తల్లితో పాటు తనకు రక్షణ కల్పించాలని ఎస్ఎస్పీని వేడుకున్నారు. అయితే ఇది కుటుంబ తగాదాలు అందులో ఆడవాళ్ల మధ్య గొడవ కావడంతో ఈ కేసును విచారించమని కేసును మహిళా పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.