ఘోరం.. ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలు..

పెద్దకొడుకు రామలింగంకు వివాహమై ఒక కూతురు ఉంది. అయితే ఐదు నెలల క్రితం రామలింగం అనారోగ్యంతో కన్నుముశాడు. అతడి భార్య రాణి(35) బిడ్డతో కలిసి అదే ఇంటిలో ఉంటుంది.

news18-telugu
Updated: July 9, 2020, 9:55 AM IST
ఘోరం.. ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ మహిళ తన భర్తను అనారోగ్యంతో ఐదు నెలల క్రితం కోల్పోయింది. తన వాటాకు రావాల్సిన ఆస్తిని పంచివ్వాలని కోరుతూ తరచూ ఆస్తి కోసం మామను అడుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరిగిన గొడవలో కర్రతో మామ తలపై మోది హత్య చేసింది. ఈ ఘటనలో తమిళనాడులోని అరియలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అరియలూరు జిల్లా సెందురై సమీపంలోని కావేరిపాళయం గ్రామానికి చెందిన రంగస్వామి(65), భార్య పళని(60) భార్యభర్తలు, వీరికి ముగ్గురు కొడుకులు. పెద్దకొడుకు రామలింగంకు వివాహమై ఒక కూతురు ఉంది. అయితే ఐదు నెలల క్రితం రామలింగం అనారోగ్యంతో కన్నుముశాడు. అతడి భార్య రాణి(35) బిడ్డతో కలిసి అదే ఇంటిలో ఉంటుంది. ఈ క్రమంలో రాని తరచూ మామ రంగస్వామితో తమ వాటాకు రావాల్సిన ఆస్తిని విభజించి ఇవ్వాలంటూ అడుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి రంగస్వామి వ్యవసాయ పనుల అనంతరం మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో కోడలు రాణి తన రావాల్సిన ఆస్తిని పంచివ్వాలంటూ మామతో గొడవకు దిగింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహించిన రాణి మామ తలపై కొట్టింది. తీవ్రంగా గాయపడిన రంగస్వామి అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని రాణిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Published by: Narsimha Badhini
First published: July 9, 2020, 9:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading