Home /News /crime /

DAUGHTER GOT MARRIED DURING THE FATHER FUNERAL IN SANGAREDDY DISTRICT SNR MDK

Tragic incident: కూతురు పెళ్లి..తండ్రి చావు అంతా ఆ గంటలోనే జరిగింది

(వివాహం-విషాదం)

(వివాహం-విషాదం)

Tragic incident: తండ్రి లేకుండా కూతురు పెళ్లి జరగదు. బిడ్డలు లేకుండా తండ్రి అంత్యక్రియలు నిర్వహించరు. కాని సంగారెడ్డి జిల్లాలో ఈ రెండు ఒకే సమయంలో జరిగాయి. ఓవైపు విషాదం, మరోవైపు వివాహం. అది కూడా ఫాదర్స్‌ డే రోజునే జరిగింది. ఎందుకలా జరిగిందో తెలుసా.

ఇంకా చదవండి ...
    (K.Veeranna,News18,Medak)
    ఏ కూతురును అనుభవించని మానసికక్షోభ ఆ కూతురు అనుభవించింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తండ్రి తన వివాహం సమయంలో పక్కన లేకుండా పోయాడు. అనారోగ్యంతో చనిపోయిన తండ్రి అంత్యక్రియలు (Father funeral)జరుగుతునన్న సమయంలోనే కూతురు వివాహం(Daughter married)జరగడం అందర్ని కంటతడి పెట్టించింది. ఫాదర్స్‌ డే(Fathers Day) రోజు కూతురును విడిచి ఓ తండ్రి శాశ్వతంగా దూరమైన విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా(Sangareddy district)లో చోటుచేసుకుంది.

    ఏ బిడ్డకు రాకూడని సమస్య..
    సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముద్దాయిపేటకు చెందిన మహ్మద్ మక్బుల్ అహ్మద్ కుమార్తె వివాహం ఆదివారం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఫాదర్స్‌ డే రోజున బిడ్డ కుమార్తె వివాహం జరుగుతున్న సమయంలోనే ఆ వేడుక చూడకుండానే తండ్రి మహ్మద్ మక్బుల్ అహ్మద్ కన్నుమూశాడు. మూడు నెలల క్రితం అహ్మద్ కుమార్తెకు సంగారెడ్డికి చెందిన యువకుడితో నిశ్చితార్ధం జరిగింది. ఆదివారం పెళ్లి నిశ్చయించారు. బంధు, మిత్రులంతా వివాహ వేడుకకు హాజరయ్యారు. అందరూ అమ్మాయిని పెళ్లికూతురుగా అలంకరించి ఫంక్షన్‌హాల్‌కి తీసుకెళ్లారు. మరో గంటలో వివాహం ఉండటంతో మహ్మద్ మక్బుల్ అహ్మద్ అస్వస్థతకు గురయ్యాడు గంటల వ్యవధిలోనే మృతి చెందాడు. అతడ్ని ఇంటి దగ్గరే ఉంచి పెళ్లి కుమార్తెతో పాటు కొందరు బంధువులు ఆమె వెంట వెళ్లి పెళ్లి జరిపించారు.



    ఒకేసారి విషాదం- వివాహం...
    తండ్రి మరణవార్తతో షాకైన బంధువులు పీటల మీద పెళ్లి ఆగిపోకుండా వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు. పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యుల్లో కొందరు కూతురు వివాహం జరిపించగా మరికొందరు ఇంటి దగ్గరే అహ్మద్ అంత్యక్రియలు పూర్తి చేశారు. కన్నతండ్రికి ఫాదర్స్‌ డే రోజున కానుకలిచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు కూతుళ్లు. అలాంటిది కూతురు పెళ్లిలో తండ్రి లేకపోవడం, తండ్రి అంత్యక్రియలకు కూతురు దూరం ఉండటం చూసిన స్థానికులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ఏ ఒక్కరికి ఇలాంటి పరిస్థితులు తలెత్తకూడదని గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు.

    ఇది చదవండి: ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవ‌ర్ .. కారణం అదేనట



    తలరాత మార్చడం ఎవరి తరం కాదు..
    సంగారెడ్డి జిల్లాలో గంటలో కూతురు పెళ్లి చూడాల్సిన తండ్రి చనిపోవడం..అదే సమయంలో వివాహం ఆగిపోకుండా పెళ్లి తంతు ముగించడం చూసిన స్థానికులు భగవంతుడు రాసే తలరాతను ఎవరూ తప్పించలేరని అంటున్నారు. అందుకేనేమో పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాని పెద్దలు చెబుతూ ఉంటారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఓ బిడ్డకు జీవితంలో జరిగే అత్యంత సంతోషకరమైన వివాహం వేడుక సమయంలో తండ్రి లేకపోవడం దురదృష్టకరమని చెప్పాలి. అటు తండ్రి అంతిమ సంస్కారాలకు బిడ్డ దూరమవడం అంతే విచారకరం.

    ఇది చదవండి : ఆ ప్లేసుల్లో ఉండే అమ్మాయిల జోలికి వెళ్లారో అంతే.. పోకిరీలపై షీ టీమ్స్ షాడో


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Father died, Sangareddy, Wedding

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు