Shocking Video: నా కూతురుతో తిరుగుతావా.. ప్యాంట్‌కు ఉన్న బెల్టు తీసి అతడు ఏం చేశాడో చూడండి..

బెల్ట్ తీసుకొని ఆ యువకుడిని కొడుతున్న యువతి తండ్రి

Shocking Video: తన కూతురుతో తిరుగుతున్న ఓ వ్యక్తిని నడి రోడ్డుపై చితకబాదాడు. ఆ తండ్రి కొడుతున్న సమయంలో సదరు వ్యక్తి లబోదిబో మంటూ మొత్తుకున్నాడు. ఏ మాత్రం కనికరం లేకుండా కొట్టాడన్న కారణంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి.

 • Share this:
  ప్రేమ(Love) కు వయస్సు (Age) అనేది ఉండదు. ఏ సమయంలో ప్రేమలో పడతారో తెలియదు. అటు యువకులు(Youth) కానీ.. ఇటు యువతులు కానీ..ప్రేమించుకొని ఆ ప్రేమను పెళ్లి(Marriage) వరకు తీసుకెళ్తుంటారు. ఇలా ప్రతీ జంట పెళ్లి దాకా వెళ్తారనేది నమ్మకం లేదు. టైం పాస్(Time Pass) గా ప్రేమించుకొని.. బయటకు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. పబ్(Pub) లకు , పార్కు(Park)లకు తిరిగేవారు కూడా చాలామంది ఉన్నారు. కన్న తల్లిదండ్రుల(Parents) గురించి ఏ మాత్రం ఆలోచించకుండా చెడు దారిలో పయణిస్తుంటారు. ఇలా ఓ జంట పబ్లిక్(Public) లో కనిపించారు.

  భార్యపై సీక్రెట్ గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.. చివరకు అందులో రికార్డయిన దృశ్యాలను చూసిన భర్త..


  ఆ జంటను అనుకోకుండా అందులో యువతి తండ్రి చూశాడు. ఇకేముంది బండి ఆపు చేశారు. వాళ్లను ఇద్దరిని పట్టుకొని బెల్ట తీసుకొని బాదడం మొదలు పెట్టాడు. అక్కడే ఉన్న కొంత మంది ఈ వీడియో (Video) ను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ (MadhyaPradesh) లోని హర్దా జిల్లా (Hardha District) లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రేమను ఇంట్లో చెప్పడానికి బయపడి కొంతమంది ఈ వ్యవహారాలను సీక్రెట్ గా సాగిస్తుంటారు.

  ‘అమ్మా లే అమ్మా.. చెల్లి ఆడుకుందాం రా.. అంటూ..’ తల్లీ, చెల్లి మృతదేహం వద్ద ఆ చిన్నారి రోధన.. ఆ దృశ్యాలు..


  వారు పెళ్లి చేసుకోవడానికి ఇలా చేస్తారో లేదో తెలియదు కానీ.. బయట మాత్రం మస్తు ఎంజాయ్చే (Enjoy) స్తూ కనిపిస్తుంటారు. అయితే ప్రేమ విషయం, ప్రేమికుడితో బయట తిరుగుతున్నట్లు తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందనే విషయాన్ని యువతీయువకులు ఊహించరు. కానీ, తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారం తెలిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారుతాయి. అటువంటి ఓ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. నిర్మానుష్య ప్రదేశంలో ఓ తండ్రికి తన కుమార్తె మరో యువకునితో కనిపించింది. దీంతో కోపం తట్టుకోలేని ఆ తండ్రి రోడ్డు మీద బహిరంగా ఇద్దరిని పట్టుకొని ప్యాంట్‌కు ఉన్న బెల్టు (Belt) తీసి చావబాదాడు.

  Saffron Flower Benefits: గర్భిణులు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల బేబీ తెల్లగా పుడతాడా..! ఉపయోగాలేంటి..


  తన కుమార్తె ఇలా అతడితో తిరగడం ఆమె తండ్రి తప్పుగా భావించాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అంటూ ఇద్దరినీ బాదాడు. ఈ ఘటనను అక్కడ ఉన్న స్థానికులు వీడియోలో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తర్వాత ఆ ప్రేమికుడు యువతి తండ్రిపై స్థానిక తిమర్ని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన దర్యాపు చేస్తున్నామని తెలిపారు. ట్రైనీ డిఎస్‌పి మరియు తిమర్నీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి రవిశర్మ ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
  Published by:Veera Babu
  First published: