హోమ్ /వార్తలు /క్రైమ్ /

Mahabubnagar: తల్లి కూతుర్ని వంట సామాన్లు కడగమంది..కోపంతో కూతురు ఏం చేసిందో తెలుసా

Mahabubnagar: తల్లి కూతుర్ని వంట సామాన్లు కడగమంది..కోపంతో కూతురు ఏం చేసిందో తెలుసా

(ఆ పని చేయమందని తల్లిపై దాడి)

(ఆ పని చేయమందని తల్లిపై దాడి)

Mahabubnagar:వంట సామాన్లు కడగమని చెప్పడమే ఆ కన్నతల్లి చేసిన పొరపాటు. తల్లి చెప్పిన పని చేయనని చెప్పింది కూతురు..అందుకు కూతురిపై తల్లికి కోపం రావడంతో మందలించింది. ఈక్రమంలోనే తల్లి,కూతుళ్ల మధ్య ఏం జరిగిందో తెలుసా.

(Syed Rafi,News18,Mahabubnagar)

వంట సామాన్లు కడగమని చెప్పడమే ఆ కన్నతల్లి చేసిన పొరపాటు. తల్లి చెప్పిన పని చేయనని చెప్పింది కూతురు..అందుకు కూతురిపై తల్లికి కోపం రావడంతో మందలించింది. ఈక్రమంలోనే తల్లి,కూతుళ్ల మధ్య గొడవ జరిగింది. అది కాసేపట్లోనే తారస్థాయికి చేరడంతో కూతురు తల్లి రక్తం కళ్లజూసింది. అత్యంత దారుణమైన ఈ సంఘటన మహబూబ్‌నగర్(Mahabubnagar)జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణ శివారులోని తిమ్మసానిపల్లి(Thimmasanipalli)లోని అద్దె ఇంట్లో నజ్మా బేగం(Najma Begum)అనే మహిళ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి అయింది. ప్రస్తుతం తన భర్త తో పాటు చిన్న కుమార్తె మోహిన్‌బేగం(Mohin Begum)తో కలిసి ఇంట్లో ఉంటుంది భర్త ఇంట్లో బీడీలు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం సాయంత్రం తల్లి తన కూతురైన పన్నెండేళ్ల కుమార్తె మోహిన్‌బేగంను అంట్లు కడగమని చెప్పింది. అందుకు ఆమె చేయనని చెప్పడంతో తల్లి కూతురు మోహిన్‌బేగంను కొట్టింది. తల్లి, కూతురు గొడవ పడ్డారు. ఆ ఘర్షణలోనే ఇంట్లో ఉన్న కాళీ బీర్‌ బాటిల్‌beer Bottle తో తల్లి తలపై కొట్టి ఇంట్లో ఉన్న కారం పొడి(Chili powder)ని చల్లింది కూతురు మోహన్‌బేగం. ఈ దాడిలో తలపై తీవ్ర గాయాలు కావడంతో పాటు గొంతు కోసుకు పోయింది చుట్టుపక్కల వారు స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి(Government General Hospital)కి తల్లిని తరలించారు గొంతు(Sore)తల (head)భాగంలో గాయం ఎక్కువ కావడంతో కుట్లు వేసి వైద్యులు తర్వాత స్కానింగ్(Scanning) చేయించారు తల్లి నజ్మా బేగం పరిస్థితి విషమంగానే ఉందని మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రమేష్ డాక్టర్ జీవన్ తెలిపారు

అంట్లు కడగమంటే గొడవ..

తల్లీ,కుతుళ్ల గొడవకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ రవి తెలిపారు. తల్లీ కూతుళ్లు కొన్నాళ్లుగా బీడీలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో గొడవ కారణంగానే కాళీ సీసాతో దాడి చేసుకోవడం అటుపై కారం చల్లుకున్నారని ఎస్‌ రవి తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బాధితురాలిని ఆసుపత్రికి తరలించామన్నారు. దాడి చేసిన కూతురిపై చర్యలు తీసుకుంటామన్నారు.

తల్లిపైనే కారం చల్లి సీసాతో కొట్టిన కూతురు..

మరోవైపు తల్లీ,కూతురికి మద్యం తాగే అలవాటు ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. తల్లి నజ్మా బేగంను కూతురు మోహిన్‌బేగం డబ్బులు అడిగిందని..ఆమె ఇవ్వనని చెప్పినందుకే ఇంట్లో ఉన్న కాళీ బీరు సీసాతో దాడి చేసిందని స్థానికులు చెబుతున్న మాట. బీరు సీసాతో తల, మెడపై కొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. అధికంగా రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు.

First published:

Tags: Crime news, Mahabubnagar

ఉత్తమ కథలు