తల్లిదండ్రులపై వేడి నూనె పోసి.. ఆపై కారంతో వెంబడించి.. కూతురి హల్‌చల్..

పెద్ద కుమార్తెకు వివాహం అయ్యింది. కానీ మూడు సంవత్సరాల నుంచి ఆమె భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ ఈనెల 10న జేమ్స్‌పాల్, అతడి భార్య ఇంట్లో నిద్రిస్తున్నారు.

news18-telugu
Updated: June 13, 2020, 2:57 PM IST
తల్లిదండ్రులపై వేడి నూనె పోసి.. ఆపై కారంతో వెంబడించి.. కూతురి హల్‌చల్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆమె ఆ ఇంటికి పెద్దకూతురు. మూడేళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. ఏమైందో ఏమోగానీ రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లిదండ్రులపై ఒక్కసారిగా వేడి నూనె పోసింది. దంపతులిద్దరూ నిద్ర నుంచి తేరుకుని బయటకు పరుగులు తీశారు. కూతురు అంతటితో ఆగకుండా వారి వెంటపడి కారం చల్లేందుకు ప్రయత్నించింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని బాలాజీ నగర్ పోలీసు స్టేషన్ పరిధి రాయపుపాలెంలో జేమ్స్ పాల్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు కూతుళ్లతో నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తెకు వివాహం అయ్యింది. కానీ మూడు సంవత్సరాల నుంచి ఆమె భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ ఈనెల 10న జేమ్స్‌పాల్, అతడి భార్య ఇంట్లో నిద్రిస్తున్నారు.

అర్ధరాత్రి సమయంలో పెద్దకూతురు వేడి నీళ్లు, వేడి వేడి నూనెను వారిపై ఒక్కసారిగా కుమ్మరించింది. దీంతో భార్యభర్తలిద్దరూ బయటకు పరుగు అందుకున్నారు. అయితే పెద్దకూతురు అంతటితో ఆగకుండా కారం తీసుకుని వారిని వెంబడించింది. ఈ క్రమంలో భార్యభర్తలిద్దరూ పెద్దగా కేకలు పెట్టడంతో స్థానికులు, ఇరుగుపొరుగు వచ్చి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై జేమ్స్ పాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆమె ఎందుకు ఇలా ప్రవర్తించిందనే విషయంపై పోలీసులు ఆరా తీశారు.
Published by: Narsimha Badhini
First published: June 13, 2020, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading