శ్రీకాకుళంలో దారుణం... తల్లిపై యాసిడ్ పోసిన కూతురు

ప్రేమించినవాడితోనే పెళ్లి జరిపిస్తామని చెప్పిన కూతురు వినలేదు. బ్యాండ్ పేపర్‌పై రాసివ్వాలని కూతురు పట్టుబట్టింది. దీనికి తల్లి... బ్యాండ్ పేపర్‌పై రాసివ్వడం ఏంటని ప్రశ్నించింది.

news18-telugu
Updated: December 8, 2019, 7:39 AM IST
శ్రీకాకుళంలో దారుణం... తల్లిపై యాసిడ్ పోసిన కూతురు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమ్మంటే కనిపించే దేవత. మనల్ని ప్రతీక్షణం కంటికి రెప్పలా కాపాడే నేస్తం. అమ్మ అనే పిలుపులోనే ఓ మమకారం దాగి ఉంటుంది. ఇక అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం... ఎంతచెప్పిన తక్కువే. మాతృమూర్తి ప్రేమ వెలకట్టలేనిది. అలాంటి తల్లిపై నేడు అనేక దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కడుపున పుట్టిన బిడ్డలే కర్కశంగా మారి కన్నవారిని హతమార్చుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఓ కూతురు ప్రేమించిన వాడితో పెళ్లి కోసం తల్లిపైనే యాసిడ్ దాడి చేసింది. ప్రేమ విషయమై తల్లి కూతుళ్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో ప్రేమించినవాడితోనే పెళ్లి జరిపిస్తామని చెప్పిన కన్నకూతురు వినలేదు. బ్యాండ్ పేపర్‌పై రాసివ్వాలని కూతురు పట్టుబట్టింది. దీనికి తల్లి... బ్యాండ్ పేపర్‌పై రాసివ్వడం ఏంటని ప్రశ్నించింది. దీంతో కోపం తట్టుకోలేని కూతురు బాత్‌రూం కడిగే యాసిడ్ తీసుకొచ్చి తల్లిపై పోసింది. దీంతో ఆమె ముఖం శరీరంపై పలుచోట్ల బొబ్బర్లు వచ్చాయి. ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తల్లి కూతుళ్లు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు