అమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీ

Mumbai : ఒక్క తప్పు మరెన్నో తప్పులు చేయించగలదు. లేనిపోని నేరాల్లో ఇరుక్కునే పరిస్థితి వస్తుంది. ఇది అలాంటి కేసే. ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: December 13, 2019, 5:54 AM IST
అమ్మో కిలాడీ... డేటింగ్ పేరుతో రూ.73 లక్షలు దోపిడీ
ఓ యువతి, మరో వ్యక్తి తనను మోసం చేశారంటూ ఓ యువకుడు హైదరాబాద్ మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు.
  • Share this:
Mumbai : అది 2018వ సంవత్సరం. ముంబైలో కాలుష్యం పెరుగుతున్న టైమ్. వన్ ఫైన్ మార్నింగ్... ఓ 65 ఏళ్ల ముసలాయనకు ఓ అందమైన అమ్మాయి నుంచీ కాల్ వచ్చింది. అనుకోకుండా రిసీవ్ చేసుకున్నాడు. తియ్యగా మాట్లాడింది. మాటలతో మత్తెక్కించింది. గురుడు పడిపోయాడు. అప్పుడు అసలు మేటర్‌లోకి వచ్చింది. తన పేరు స్నేహ అని చెప్పింది. తను ఓ డేటింగ్ వెబ్‌సైట్ నడుపుతున్నాననీ... అందులో మెంబర్‌షిప్ తీసుకుంటే... కోరుకున్న ప్రాంతానికి అందమైన అమ్మాయిలను పంపిస్తానని చెప్పింది. లేటు వయసులో ముసలోడికి కోరికలు మళ్లీ పుట్టాయి. ఆశలు చిగురించాయి. ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. వెంటనే తన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించింది. అందుకోసం ఫీజుల పేరుతో బాగానే నొక్కేసింది. నాల్రోజుల తర్వాత మరోసారి కాల్ చేసి... మెంబర్‌షిప్‌లో స్పీడ్ డేటింగ్ మెంబర్‌షిప్ అనేది ప్రత్యేకంగా ఉంటుందనీ... అది తీసుకుంటే... ఎలాంటి డిమాండ్ ఉన్న అమ్మాయినైనా డైరెక్టుగా పంపించేస్తామని చెప్పింది. సరే అంటూ ఆ మెంబర్‌షిప్ తీసుకున్నాడు. దానికి అదనంగా ఫీజులు చెల్లించాడు.

ఆ తర్వాత వారమైనా ఏ అమ్మాయినీ పంపలేదు. చిరాకొచ్చిన ముసలాయన తన మెంబర్‌షిప్ రద్దు చేసేయమనీ, డబ్బులు వెనక్కి ఇచ్చేయమని కోరాడు. అంత సీన్ లేదంది. రద్దు కుదరదంది. ఇలాగైతే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానన్నాడు. వెంటనే నువ్వు కాదు... నేనే ఇస్తాను. అంటూ... నెక్ట్స్ మార్నింగ్ ముసలాయనకు ఓ లీగల్ నోటీస్ పంపింది. అది పోలీసులు పంపినట్లుగా ఉంది. అందులో... ముసలాయన తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్నేహ కేసు పెట్టినట్లు ఉంది. అది చూసిన ముసలాయన బాగా భయపడ్డాడు. తనను పోలీసులు అరెస్టు చేస్తే... తన డేటింగ్ మేటర్ మొత్తం తన కుటుంబీకులకూ, చుట్టుపక్కల వాళ్లకూ అందరికీ తెలిసిపోతుందని టెన్షన్ పడ్డాడు. కేసు వాపస్ తీసుకోవడానికి తాను ఏం చెయ్యాలో చెప్పమన్నాడు.

గురుడు లైన్లోకి వచ్చాడనుకున్న స్నేహ... అప్పటి నుంచీ ఏడాది పాటూ... అప్పుడప్పుడూ మనీ లాగేస్తూ వచ్చింది. ఇలా ఇప్పటివరకూ రూ.73 లక్షలు కాజేసింది. రాన్రానూ ఈ టార్చర్ ఎక్కువవడంతో... ముసలాయనకు మండింది. మేటర్ తేల్చేయాలనుకున్నాడు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తనే కంప్లైంట్ ఇచ్చాడు. తన పేరు బయటకు రాకూడదని కోరాడు.

పోలీసులు నిఘా పెట్టారు. ఆమె కాల్స్‌ను ట్రాక్ చేశారు. లొకేషన్ తెలిసింది. కట్ చేస్తే... స్నేహ అలియా్ మహీదాస్ (25), ప్రబీర్ సాహా (35), అర్నబ్ రాయ్ (26).... ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీళ్లే ఈ తంతంతా నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఇదీ మేటర్. ఒక్క తప్పు... ఎన్నో తప్పులు చేయించింది. రూ.73 లక్షలు పోయాయి. పరువూ పోయింది. 

స్ట్రీట్ డాన్సర్‌తో దుమ్మురేపుతానంటున్న నోరా ఫతేహీఇవి కూడా చదవండి :

 

గాలి నుంచి నీరు... లీటర్ రూ.5... ఎక్కడో తెలుసా?

Health Tips : గుండె ఫిట్‌గా ఉండాలా... ఈ 5 చిట్కాలు పాటించండి

Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

Health Tips : డయాబెటిస్ ఉంటే ఖర్జూరాలు తినవచ్చా?

పాము కాటేసినప్పుడు టీ తాగితే ఏమవుతుంది?
First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు