• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • DATING APP GANG CHEATS MAN IN HYDERABAD AND ACCUSED ARRESTED BY CYBER CRIME POLICE SSR

Dating App Gang: ఎస్సార్ నగర్‌లో ఉంటున్న ఓ యువకుడు అమ్మాయి స్వీట్ వాయిస్‌కు పడిపోయాడు.. చివరికి..

Dating App Gang: ఎస్సార్ నగర్‌లో ఉంటున్న ఓ యువకుడు అమ్మాయి స్వీట్ వాయిస్‌కు పడిపోయాడు.. చివరికి..

ప్రతీకాత్మక చిత్రం

సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు నేరం చేసే పద్ధతి మారుతుందేమో గానీ నేరాలు మాత్రం మానడం లేదు. హైదరాబాద్‌లో ఓ యువకుడికి డేటింగ్ యాప్స్‌తో ఎర వేసి రూ.11.3 లక్షలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి ఉద్యోగ నిమిత్తం...

  • Share this:
    హైదరాబాద్: సైబర్ నేరాలను నియంత్రించేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లు నేరం చేసే పద్ధతి మారుతుందేమో గానీ నేరాలు మాత్రం మానడం లేదు. హైదరాబాద్‌లో ఓ యువకుడికి డేటింగ్ యాప్స్‌తో ఎర వేసి రూ.11.3 లక్షలు కాజేసిన ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరానికి ఉద్యోగ నిమిత్తం వచ్చిన ఓ వ్యక్తి ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటూ జాబ్ చేస్తున్నాడు. సొంత ఊరిలో ఉంటున్న తండ్రి కొన్నాళ్ల క్రితం ఉద్యోగ విమరణ చేయగా రూ.15 లక్షలు బెనిఫిట్స్‌గా వచ్చాయి. ఆ డబ్బును కొడుకు పేరు మీద సొంతూళ్లోనే ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. ఈ ఖాతాకు సంబంధించి లావాదేవీలన్నీ కొడుకుకే ఆ తండ్రి అప్పగించాడు. దీంతో.. యోనో యాప్‌ను ఆయన కుమారుడు స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించేవాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం సదరు యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది.

    వీళ్లిద్దరి మధ్య వాట్సాప్‌లో చాటింగ్, ఫోన్ కాల్స్ నడిచాయి. స్వీట్ వాయిస్‌తో మాట్లాడి అవకాశం చూసుకుని యువతి ఆ యువకుడి ఫోన్‌లో ‘గూగుల్ ప్లే సర్వీసెస్’ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించింది. ఆ యాప్‌ను యాక్సెస్ చేయడానికి అవసరమైన నంబర్‌ను తెలుసుకుని ఆమె ఫోన్ ద్వారా ఉపయోగించేలా పన్నాగం పన్నింది. ఒక రోజు చాలాసేపు చాటింగ్ చేశాక ఆ యువకుడు ఫోన్‌ను చార్జింగ్ పెట్టి బయటకు వెళుతున్నట్లు ఆమెకు చెప్పాడు. అవకాశం కోసం ఎదురుచూసిన సదరు యువతి యాప్ ద్వారా అతని ఫోన్‌ను యాక్సెస్ చేసింది. యోనో యాప్ ద్వారా వాళ్ల సొంతూళ్లో ఉన్న బ్యాంకు ఖాతాలోని ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును రద్దు చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలను బెంగళూరులో మహేశ్వర్ పేరుతో ఉన్న ఖాతాలోకి మళ్లించింది. పని పూర్తి కాగానే ఫోన్‌లోని యోనో యాప్‌తో సహా అన్ని యాప్స్ డిలీట్ చేసి ఫార్మాట్ కొట్టేసింది.

    యువకుడు బయట నుంచి రూంకు తిరిగి వెళ్లి ఫోన్ చూసుకోగా యాప్స్ అన్నీ డిలీట్ అయి ఉండటాన్ని గమనించాడు. దీంతో.. కంగుతిన్న బాధితుడు మోసపోయినట్లు గ్రహించాడు. సిటీ సైబర్ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో హరిప్రసాద్, కేశవ, అన్జురాజ్‌ను నిందితులుగా చేర్చారు. ఈ గ్యాంగ్ తిరుపతిలో కూడా ఓ యువకుడి నుంచి ఇదే తరహాలో రూ.7.5 లక్షలు కాజేసినట్లు విచారణలో తేలింది. యువకుడితో ఫోన్‌లో మాట్లాడిన యువతి ఎవరనే దిశగా దర్యాప్తు సాగుతోంది. డేటింగ్ యాప్స్‌కు ఆకర్షితులై మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    అగ్ర కథనాలు