ఓటేయమని కాల్ వచ్చిందా?... మీ ఫోన్ నెంబర్ వాళ్ల దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా...

‘ఫలనా అభ్యర్థికే ఓటు వేయండి...’ అంటూ కాల్స్... తమ నెంబర్ వారి దగ్గరికి ఎలా వెళ్లిందో తెలియక తికమక పడుతున్న జనాలు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 1, 2019, 11:23 PM IST
ఓటేయమని కాల్ వచ్చిందా?... మీ ఫోన్ నెంబర్ వాళ్ల దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా...
నమూనా చిత్రం
  • Share this:
ఎన్నికల ప్రచారం, ప్రకటనలు, వాగ్దానాలతో దేశంలో వాతావరం వేడెక్కింది. పోలింగ్ డేట్ ముంచుకొస్తోంది. ఓటర్‌ను ఆకర్షించేందుకు ఎన్నిరకాల దారులు ఉన్నాయో... అన్నింటినీ ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు నాయకులు. ఉన్నట్టుండి తెలియని నెంబర్ నుంచి ఫోన్ రావడం... ‘ఫలానా పార్టీ నుంచి పోటీ నుంచి ఫలానా అభ్యర్థినే ఓటు వేయండి...’ అంటూ నాయకులు, వారి అనుచరులు చెప్పడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ‘మాకు తెలియకుండా మా ఫోన్ నెంబర్ వాళ్లకెలా తెలిసింది...’ అనేది ప్రస్తుతం అందరిలోనూ కలుగుతున్న అతిపెద్ద సందేహం. పెద్దగా పట్టించుకోకపోయినా దీని వెనక పెద్ద నెట్‌వర్క్ ఉంది.

విశాల్ హీరోగా వచ్చిన ‘అభిమన్యుడు’ సినిమాలో లాగే ఇక్కడా జరుగుతున్నది ‘డేటా చోరీ’యే! తమ నియోజికవర్గంలో ఉన్న ఓటర్ల నెంబర్లు, వారి సమాచారం సేకరించేందుకు ప్రైవేటు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు నాయకులు. ఈ ఏజెంట్లు ప్రజల దగ్గరి నుంచి అతి తేలికగా సమాచారం సేకరించే పద్ధతులను ఎన్నుకుంటున్నారు. ఏరియాల్లో ఉండే సమాచారం ఎవ్వరి దగ్గర ఉంటుందనే విషయం పక్కా ప్లానింగ్‌తో పసిగడుతున్నారు. కేబుల్ తీసుకునేటప్పుడు కచ్చితంగా పేరు, మొబైల్ నెంబర్, అడ్రెస్ వంటి వివరాలు ఇచ్చి తీరుతారు. ఈ సమాచారాన్ని కేబుల్ ఆపరేటర్ల దగ్గర్నుంచి సేకరిస్తున్న ఏజెంట్లు... మరింత సమాచారం కోసం గ్యాస్ ఏజెన్సీ, మీ-సేవా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులను ఆశ్రయిస్తున్నాయి. ఇంకొందరు మరికాస్త ముందుకెళ్లి మొబైల్ ఆపరేటర్ల నుంచే సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా వంటి సిమ్ తీసుకునేటప్పుడు వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తాం. ఒక్కసారి సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ చెత్తకుప్పలోకే చేరుతాయి. కాని వాటిని అతి భద్రంగా దాచిపెట్టి, ఆ డేటాను ఏజెన్సీలకు అమ్ముకుంటున్నాయి కొన్ని సంస్థలు. ఇది చాలా పెద్ద నేరం. కానీ గుట్టుగా జరుగుతున్న అతిపెద్ద సమాచార దోపిడీ వ్యాపారం. ఇవీ కాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా సమాచారాన్ని సేకరించి, కాచి వడబోస్తున్నాయి కొన్ని ఏజెన్సీలు.

ఇలా మన ఫోన్ నెంబర్లే కాకుండా, మనకు మాత్రమే సొంతం అనుకున్న చాలా వ్యక్తిగత సమాచారం ఏజెంట్ల చేతుల్లోకి వెళుతోంది. ఆ విషయం ఇలా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చే కాల్స్ ద్వారా తెలుస్తుంది.
Published by: Ramu Chinthakindhi
First published: April 1, 2019, 11:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading