వీడు మామూలోడు కాదు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కున్న దొంగ..!!

ఏదైనా వస్తువు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి అదే చేశాడు. కానీ కోల్పోయిన వస్తువు అతడిది కాదు.. అదే ఈ కేసులో ట్విస్ట్..!

news18
Updated: October 21, 2020, 7:41 AM IST
వీడు మామూలోడు కాదు.. పోగొట్టుకున్న చోటే వెతుక్కున్న దొంగ..!!
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: October 21, 2020, 7:41 AM IST
  • Share this:
ఒక వస్తువో లేక మరేదైనా కోల్పోయినట్టైతే.. దానిని తిరిగి అదే చోట వెళ్లి వెతకాలని పెద్దలు చెబుతారు. చాలా మంది విజేతలు కూడా తాము ఏమి కోల్పోయామో తెలుసుకుని.. తమ తప్పులను సరిదిద్దుకుని విజయాలు సాధించారు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి కూడా కోల్పోయిన చోటే ఆ వస్తువును తిరిగి సంపాదించుకున్నాడు. కానీ ఆ వస్తువు అతడికి కాదు.. అదెలా అనుకుంటున్నారా..? మీ ఊహా నిజమే. అతడో దొంగ. ట్రక్ దొంగిలించిన కేసులో జైలు కెళ్లి.. బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే అదే ట్రక్ ను పోలీస్ స్టేషన్ నుంచే ఎత్తుకెళ్లాడు ఆ ఘనాపాటి. పోలీసులు కూడా ఊహించని ఈ ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన సంజయ్ దోన్ పేరుమోసిన దొంగ. గతంలోనూ సుమారు 20 దొంగతనం కేసుల్లోనూ అతడి పేరున్నది. అయితే కొద్దిరోజుల క్రితం అతడు ఒక ట్రక్ ను దొంగతనం చేయగా.. పోలీసులు అతడిని పట్టుకొచ్చి జైలులో వేశారు. ఎలాగోలా బెయిల్ తెచ్చుకున్న ధోన్.. పోలీసులకే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

సంజయ్ ను జైళ్లో వేసినా.. అతడు దొంగిలించిన బండి మాత్రం స్టేషన్ సమీపంలోనే పార్క్ చేసి ఉంచారు పోలీసులు. వారి రికార్డులలో ట్రక్ వివరాలు నమోదుచేసుకోవడానికి గానూ అక్కడే ఉంచారు.

అయితే బెయిల్ పై విడుదలైన సంజయ్ కన్ను మళ్లీ అదే ట్రక్ మీద పడింది. దీంతో... బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే దానిని దొంగిలించాలనుకున్నాడు. అనుకన్నదే తడువుగా రాత్రి పూట ట్రక్ ను అక్కడి నుంచి ఎత్తుకెళ్లడానికి వెళ్లాడు. ట్రక్ పక్కన కాపలా ఉన్న వ్యక్తిని చితకబాది.. ఆ వాహనంతో సహా అక్కడినుంచి ఉడాయించాడు.

కాగా పోలీసులకు ఊహించని ఝలక్ ఇచ్చిన సంజయ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుని కటకటాలవెనక్కి పంపిస్తామని లకడ్గాన్ పోలీసులు తెలిపారు. అయితే సంజయ్ ఎక్కడికి పారిపోయాడో ఇంతవరకు ఎలాంటి ఆధారాలూ లేవు.
Published by: Srinivas Munigala
First published: October 21, 2020, 7:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading