హోమ్ /వార్తలు /క్రైమ్ /

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆటోను లారీ ఢీ కొనడంతో వాగులో 5గురు గల్లంతు

Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఆటోను లారీ ఢీ కొనడంతో వాగులో 5గురు గల్లంతు

నెల్లూరులో ఘోర ప్రమాదం.. వాగులో కొట్టుకుపోయిన 15 మంది

నెల్లూరులో ఘోర ప్రమాదం.. వాగులో కొట్టుకుపోయిన 15 మంది

Road Accident: ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో.. పక్కనే ఉన్న వాగులో పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు నీటిలో పడిపోయారు. వారిలో ప్రస్తుతం ఇంకా ఐదుగురి ఆచూకీ దొరకాల్సి ఉంది. సురక్షితంగా బయటకు వచ్చిన వారిలో ఒకరి పరిస్థితి విషమం అంటున్నారు.

ఇంకా చదవండి ...

Road Accident In Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నెల్లూరు జిల్లా (Nellore District)లో గురువారం రాత్రి(9.30 గంటలు) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సంగం దగ్గర ఓ లారీ.. ప్రయాణికుల ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో (Lorry Accident) ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది ఉన్నారు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా, ఆరుగురిని పోలీసులు, స్థానికులు కాపాడారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆటోలో ఉన్న ప్రయాణికులకు (Passengers) ఏం జరుగుతోందో తెలిసే లోపే వారు ఆటోతో సహా వాగులో పడిపోయారు.  ప్రమాదం గురించి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.  నీటిలో కొట్టుకుపోతున్న ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు.

సంగం సమీపంలోని బీరాపేరు వాగులో మొత్తం 12 మంది కొట్టుకుపోగా.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన పోలీసులు స్థానికులతో కలిసి పది మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మిగిలిన ఐదుగురు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పూర్తిగా చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. వాగులోంచి కాపాడిన ఏడుగురిలో ఓ బాలిక మరణించినట్టు సమాచారం. మిగిలిన క్షత గాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి : కుప్పంలో ఇక డైరక్ట్ అటాక్.. చంద్రబాబుపై పోటీకి బరిలో యువనేత

ఆత్మకూరు నుంచి నుంచి సంగంలోని శివాలయంలో నిద్ర చేసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయం రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాగులోంచి స్థానికులు కాపాడిన వారిలో బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలిక మృతి చెందింది. బాధితులంతా ఆత్మకూరు జ్యోతి నగర్ వాసులు.

ఇదీ చదవండి : చంద్రబాబు సంచలన నిర్ణయం.. కంచుకోట నుంచే ప్రక్షాళన.. కోవర్టుల ఏరివేత

గల్లంతైన వారిలో సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, ఆదెమ్మ, పద్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. వాగులో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. బోట్ల రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన ఐదుగురు ఆచూకీ తెల్లవారు జామున దొరికే అవకాశం ఉంది అంటున్నారు పోలీసులు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Accident, Andhra Pradesh, AP News, Road accident

ఉత్తమ కథలు