హనీ సింగ్ పాటలకు డ్యాన్స్... టిక్‌టాక్‌లో పెట్టి బుక్కైపోయారు...

తమ వద్ద ఉన్న గన్‌లను చూపిస్తూ.. డ్యాన్సులు వేస్తూ హంగామా చేస్తుంటారు. ఆ జోష్‌లోనే వారు హనీసింగ్ పాటలకు డ్యాన్స్‌లు చేశారు.

news18-telugu
Updated: March 30, 2019, 8:54 PM IST
హనీ సింగ్ పాటలకు డ్యాన్స్... టిక్‌టాక్‌లో పెట్టి బుక్కైపోయారు...
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 30, 2019, 8:54 PM IST
టిక్ టాక్ పిచ్చి ఇద్దరు యువకులను జైలుకు పంపింది. హనీసింగ్ పాటలకు డ్యాన్స్‌లు చేసిన ఆ ఇద్దరు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. న్యూఢిల్లీలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని విపిన్ గార్డెన్ ఏరియాకు చెందిన ఇద్దరు యువకులు షహజాద్, మోను ఇద్దరు ఓ చికెన్ షాపులో పనిచేస్తుంటారు. షహజాద్ తండ్రిదే ఆ చికెన్ షాప్. పబ్లిక్ ఫంక్షన్లు అన్నిటికీ హాజరవుతూ.. తమ వద్ద ఉన్న గన్‌లను చూపిస్తూ.. డ్యాన్సులు వేస్తూ హంగామా చేస్తుంటారు. ఆ జోష్‌లోనే వారు హనీసింగ్ పాటలకు డ్యాన్స్‌లు వేస్తూ, తమ వద్ద ఉన్న గన్స్‌ను గాల్లోకి ఊపుతూ హంగామా చేశారు. ఆ వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోను చూసిన పోలీసులు వారిని ట్రాప్ చేశారు. నిందితుల వద్ద ఓ పిస్టల్, నాటు తుపాకీ, బుల్లెట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

First published: March 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...