news18-telugu
Updated: February 29, 2020, 12:03 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
US Dance Teacher Rape Case : అమెరికా... టెన్నెస్సీలో ఓ డాన్స్ టీచర్ కేసు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఓ మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడి... ఆ బాలుడికి HIV ఎయిడ్స్ సోకేందుకు కారణమైన డాన్స్ టీచర్‌కి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల జాన్ కాన్నర్ 3... శిక్ష తర్వాత మరో నాలుగేళ్లపాటూ... జైల్లో ప్రొబేషన్ కింద ఉండాల్సి ఉంది. అలాగే అతని పేరును లైంగిక నేరస్థుల రిజిస్ట్రీలో జీవితాంతం రాసి ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. జాన్ కాన్నర్ తప్పు చేసినట్లు 2019 నవంబర్‌లో నేరం రుజువైంది. సమాజంలో పేరుండి, సెలబ్రిటీ అయివుండీ... బాధ్యతగా మెలగాల్సిన కాన్నర్... తన సెలబ్రిటీ హోదాను ఉపయోగించుకొని... ఈ దారుణానికి పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.
2015లో కాన్నర్.. 16 ఏళ్ల టీనేజర్‌ను ఆన్లైన్లో కలిశాడు. ఆ తర్వాత డాన్స్ నేర్పిస్తానంటూ... ఆ మైనర్ కుర్రాడికి దగ్గరయ్యాడు. చాలాసార్లు అరక్షిత (unprotected) లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఐతే... 2012 నుంచీ కాన్నర్‌కు HIV ఎయిడ్స్ ఉంది. ఈ విషయాన్ని ఆ కుర్రాడికి అతను చెప్పలేదు. ఇప్పుడా కుర్రాడికి వైద్య పరీక్షలు జరపగా... అతనికి కూడా HIV ఎయిడ్స్ సోకినట్లు తేలింది. ఇలా... మైనర్‌పై చాలాసార్లు అత్యాచారం చేసి, అతనికి HIV ఎయిడ్స్ వచ్చేందుకు కారణమైనందుకు జాన్ కాన్నర్... దోషిగా శిక్షార్హుడయ్యాడు.
జాన్ కాన్నర్... బ్రింగ్ ఇట్ అనే డాన్స్ షో ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఈ షో... మిడ్-సౌత్ కాంపిటీటివ్ డాన్స్ టీమ్స్‌లో ప్రదర్శనకు నిలిచింది. తద్వారా మంచి పేరు తెచ్చుకున్న కాన్నర్... ఇప్పుడు నేరస్థుడిగా జైల్లో కూర్చున్నాడు.
Published by:
Krishna Kumar N
First published:
February 29, 2020, 12:03 PM IST