బిర్యానీ అమ్ముతున్న దళిత యువకుడిపై దాడి..

ఫోర్ వీలర్‌లో అతని తోపుడుబండి వద్దకు వచ్చిన ఆ వ్యక్తులు.. అతను వెజ్ బిర్యానీ అమ్ముతున్న బండిని ధ్వంసం చేశారు.

news18-telugu
Updated: December 15, 2019, 2:24 PM IST
బిర్యానీ అమ్ముతున్న దళిత యువకుడిపై దాడి..
బాధిత యువకుడు (Image : ANI)
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్దనగర్ జిల్లాలోని రబపురాలో దారుణం జరిగింది. బిర్యానీ అమ్ముతున్న లోకేష్(43) అనే దళిత వ్యక్తిపై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫోర్ వీలర్‌లో అతని తోపుడుబండి వద్దకు వచ్చిన ఆ వ్యక్తులు.. అతను వెజ్ బిర్యానీ అమ్ముతున్న బండిని ధ్వంసం చేశారు. అడ్డుపడినందుకు కులం పేరుతో అతన్ని దూషించారు.ఇంకెప్పుడూ బిర్యానీ అమ్మవద్దంటూ అతన్ని హెచ్చరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. లోకేష్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading