Home /News /crime /

DALITH BTECH STUDENT COMMITS SUCIDE AFTER LOVER SENDS NUDE VIDEO TO HER BROTHER IN SRIKAKULAM DISTRICT MKS

Srikakulam : అన్న మొబైల్‌కు చెల్లెలి అశ్లీల వీడియో -బీటెక్ విద్యార్థిని బలవన్మరణం -షాకింగ్ ట్విస్టులు

రీపోస్ట్ మార్టం దృశ్యాలు. మృతురాలు పగడాలమ్మ పాత ఫొటో

రీపోస్ట్ మార్టం దృశ్యాలు. మృతురాలు పగడాలమ్మ పాత ఫొటో

శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం, కొత్తచెలికానివలసలో బీటెక్ విద్యార్థిని పగడాలమ్మ బలవన్మరణం ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకున్న పక్క గ్రామానికి చెందిన హరీశ్ అనే కీచకుడు.. బాధితురాలి అశ్లీల వీడియోను ఆమె సోదరుడికి పంపాడు. ఖననం చేసిన మృతదేహాన్ని మళ్లీ తొవ్వించిన పోలీసులు రీపోస్ట్ మార్టం నిర్వహించారు..

ఇంకా చదవండి ...
పుట్టి పెరిగింది పూరి గుడిసెలోనే అయినా, చదువుల్లో రాణించిందా అమ్మాయి. భవిష్యత్తుపై ఎన్నో కలలతో బీటెక్ లో చేరింది. రోజూ కాలేజీకి వస్తూపోతుండే ఆమెపై కన్నేశాడో యువకుడు. కులాలు వేరని తెలిసినా.. ప్రేమిస్తున్నానని నమ్మకంగా చెప్పడంతో అతనికి దగ్గరైంది. వాళ్లిద్దరూ ఏకాతంగా గడిపిన దృశ్యాలను అతను రహస్యంగా చిత్రీకరించాడని తెలుసుకోలేకపోయింది. ఆ కీచక ప్రేమికుడు యువతి అశ్లీల వీడియోను ఆమె అన్నకు పంపాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. పరువు పోతుందనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా ఆమెను ఖననం చేశారు కుటుంబీకులు. విషయం తెలుసుకున్న దళిత సంఘాలు కుటుంబానికి అండగా నిలబడటంతో ఎట్టకేలకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని మళ్లీ తొవ్వితీసి, రీపోస్ట్ మార్టం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో సంచలనం రేపిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు, కుటుంబీకులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

పక్క ఊరి కుర్రాడితో పరిచయం..
శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం, కొత్తచెలికానివలసలో చోటుచేసుకున్న దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన రాకోటి రామారావు కూలీనాలీ చేసుకుని జీవనం సాగిస్తుంటారు. పేదరికంలో ఉన్నప్పటికీ చిన్నకూతురైన పగడాలమ్మను బీటెక్ చదివిస్తున్నాడా తండ్రి. కాలేజీకి రాకపోకలు సాగించే క్రమంలో పగడాలమ్మకు.. రంగరాయపురానికి చెందిన డబ్బాడ హరీశ్ తో పరిచయం ఏర్పడింది.

కులాంతర వివాహం చేసుకుందామని..
కులాలు వేరైనప్పటికీ పగడాలమ్మ, హరీశ్ ల మద్య పరిచయం ప్రేమగా మారింది. కులాంతర వివాహం చేసుకుందామని నమ్మకంగా చెప్పడంతో హరీశ్ కు ఆమె శారీరకంగానూ దగ్గరైంది. ఆమె వలలో చిక్కిన తర్వాతగానీ హరీశ్ అసలు రూపం బయటపడలేదు. వాళ్లిద్దరూ ఏకాంతంగా కలిసున్న దృశ్యాలను హరీశ్ రహస్యంగా తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఆ వీడియోలను అడ్డంపెట్టుకుని ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. ఈ క్రమంలోనే..

 వాట్సాప్ లో అశ్లీల వీడియోలు
అశ్లీల వీడియోలను అడ్డం పెట్టుకుని తన బతుకు పాడుచేయొద్దని పగడాలమ్మ ఎంత వేడుకున్నా హరీశ్ వినిపించుకోలేదు. బెదిరింపులకు లొంగకపోవడంతో చివరికి అతను దుర్మార్గానికి పాల్పడ్డాడు. విజయవాడలో పనిచేస్తోన్న పగడాలమ్మ సోదరుడు ప్రవీణ్ కు ఆమె అశ్లీల వీడియోలను పంపాడు హరీశ్. తెలిసినవాళ్లు అందరికీ వీడియోలు పంపుతానని బెదిరించాడు. దీంతో పగడాలమ్మ తీవ్ర మనస్తాపానికగురై గత నెల 30న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

గుట్టుచప్పుడు కాకుండా ఖననం
చనిపోయిన తమ కూతురు బాధితురాలేనన్న స్పృహ లేకపోవడం, వీడియోల గురించి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంంతో కుటుంబీకులు గుట్టుచప్పుడు కాకుండా పగడాలమ్మ మృతదేహాన్ని ఖననం చేసేశారు. కానీ పగడాలమ్మకు జరిగింది తీరని అన్యాయం అని, ఈ ఉదంతంలో ఆమె బాధితురాలేనని అర్థమైన తర్వాతగానీ, దళిత సంఘాల సహాయంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యాయం కోసం ఆందోళన..
కుటుంబీకుల ఫిర్యాదుతో పగడాలమ్మ మృతిపై రేగిడి ఆముదాలవలస పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శనివారం నాడు పగడాలమ్మను ఖననం చేసిన ప్రదేశాన్ని మళ్లీ తొవ్వి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేశారు. నిందితుడు హరీశ్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ప్రేమ పేరుతో పేద విద్యార్థినిని లోబర్చుకుని, అశ్లీల వీడియోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడి, ఆమె మృతికి కారకుడైన హరీశ్ ను కఠినంగా శిక్షించాలంటూ కుటుంబీకులు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు.
Published by:Madhu Kota
First published:

Tags: AP News, College student, Srikakulam, Student suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు