Gang Rape in Police Custody: పోలీసు కస్టడీలో గ్యాంగ్ రేప్.. బాధితులిద్దరూ దళితులే..

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలుచేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా అవి నీటిమాటలే అవుతున్నాయి. పోలీసులు ఫ్రెండ్లీగా ఉండటం అటుంచి.. అక్కడికెళ్లిన మహిళలకు రక్షణ కరువవుతున్నది. ఇక బాధితులు తక్కువ కులానికి చెందినవారైతే వారి బాధలు అరణ్య రోధనలే అవుతున్నాయి.

news18
Updated: November 4, 2020, 8:46 AM IST
Gang Rape in Police Custody: పోలీసు కస్టడీలో గ్యాంగ్ రేప్.. బాధితులిద్దరూ దళితులే..
ప్రతీకాత్మకచిత్రం
  • News18
  • Last Updated: November 4, 2020, 8:46 AM IST
  • Share this:
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలుచేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు.. ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా అవి నీటిమాటలే అవుతున్నాయి. పోలీస్ స్టేషన్లలో స్నేహపూర్వకమేమో గానీ.. వాళ్లు పెట్టే బాధలకు బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఖాకీల కర్కశ ప్రవర్తన తట్టుకోలేక.. ఆ ఒత్తిళ్లు తట్టుకునే శక్తి లేక పలువురు జైళ్లల్లోనే సమాధి అవుతుండగా.. మరికొంతమంది లాకప్ డెత్ కూడా అవుతున్నారు. ఇక మహిళలు పోలీసు స్టేషన్లకు వెళ్తే భద్రత అనేది గాలిలో దీపమే అవుతున్నది. అందులోనూ దళిత మహిళలైతే వారికి న్యాయం సంగతి అటుంచి.. శీలం కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. హర్యానాలో పోలీసులే దళిత యువతులిద్దరినీ గ్యాంగ్ రేప్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 29 న హర్యానాలోని బుటానా ప్రాంతంలో ఓ హత్య జరిగింది. ఈ కేసులో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ ఒకరు.. ఇద్దరు పోలీసులను హతమార్చాడు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు.. నిందితుడి సంబంధీకులను కూడా విచారించారు. వారంతా దళితులే కావడం గమనార్హం. అయితే సదరు గ్యాంగ్ స్టర్ కు బంధువైన తల్లికి ఒక కూతురుంది. పోలీసుల కన్ను ఆ యువతి (అప్పటికీ ఆమె ఇంకా మైనరే..) మీద పడింది. ఆమె తో పాటు ఉన్న మరో బంధువును కూడా పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జులై 2న వారిరువురిని స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వారితో పాటు కుటుంబసభ్యులను కూడా కొన్ని గంటల పాటు స్టేషన్లో ఉంచారు. అనంతరం వారిని పంపించి.. ఆ ఇద్దరు మైనర్లని మాత్రం అక్కడే ఉంచారు. అక్కడ వారిరువురిపై సుమారు ముగ్గురు పోలీసులు గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలి తల్లి ఆరోపిస్తుంది.

ఇదే విషయమై బాధితురాలు స్పందిస్తూ.. తనతో పాటు మరో మైనర్ ను కూడా పోలీసులు లైంగికంగా వేధించారని తెలిపింది. అంతేగాక తమపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని ఆరోపించింది. ‘వాళ్లు కొట్టిన దెబ్బలకు నాకు గాయాలయ్యాయి. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగాను. దానికి పోలీసులు బదులిస్తూ.. మేమే నీకు వైద్యం చేస్తాం అంటూ అసభ్యంగా ప్రవర్తించారు. నేను చెప్పుకోలేని చోట తాకుతూ నన్ను వేధింపులకు గురి చేశారు..’ అంటూ ఆ యువతి కన్నీరుమున్నీరైంది.

స్టేషన్ నుంచి వచ్చిన తర్వాత ఆ యువతి ప్రయివేట్ పార్ట్స్ నుంచి రక్తస్రావం అవడం చూసి ఆ తల్లి బెదిరిపోయింది. తీరా మెడికల్ టెస్టులకు తీసుకెళ్లగా ఆమె అసలు విషయం బయటపెట్టింది. పోలీసులు తన ప్రయివేట్ పార్ట్స్ లో కర్రలు, సీసాలు ఉంచారని తెలిపింది.

ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిచి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. బాధితురాలు తల్లి కూడా పోలీసుల మీద ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు ఈ కేసును సిట్ కు అప్పగించారు. ప్రస్తుతం సదరు పోలీస్ స్టేషన్ లోని పోలీసులు విచారణకు హాజరవుతున్నారు.
Published by: Srinivas Munigala
First published: November 4, 2020, 8:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading