హోమ్ /వార్తలు /క్రైమ్ /

మత్తుమందు ఇచ్చి మహిళపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరిస్తూ.. ఆ తర్వాత..

మత్తుమందు ఇచ్చి మహిళపై అఘాయిత్యం.. వీడియో తీసి బెదిరిస్తూ.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rajasthan: మహిళకు మాయమాటలు చెప్పిలొంగ దీసుకున్నాడు. ఇంట్లో ఎవరు లేనిది చూసి.. ఆమెకు మత్తుమందు కలిపిన పదార్థం తినిపించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన మహిళల భద్రత ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఒంటరిగా మహిళలు బయట వెళ్లలేని పరిస్థితులు కన్పిస్తున్నాయి. ప్రతిరోజు మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. మహిళలు ఒంటరిగా కన్పిస్తే చాలు ఏదోక వంకతో కామాంధులు రెచ్చిపోతున్నారు. బస్టాంగ్, రైల్వేస్టేషన్, ఆఫీస్, గుడి, బడి, ఎక్కడ కూడా మహిళలకు సరైన సెక్యురిటీ లేదు. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలు వేధింపులకు గురౌతున్నారు. కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులే మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందినన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan) దారుణమైన ఘటన సంభవించింది. అజ్మీర్ లోని 25ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి రోజుల తరబడి బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. మాయమాటలు చెప్పి, ఆమెకు మత్తుమందు కలిపిన పదార్థం తినిపించాడు. ఆతర్వాత.. ఆమె అపస్మారక స్థితిలోనికి వెళ్లాక ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనను వీడియో తీశాడు. అది ప్రతిసారి ఆమెకు చూపిస్తూ, వైరల్ చేస్తానని బెదిరిస్తూ పదే పదే అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే... ఆమెను వేరే చోటికి తీసుకెళ్లి గదిలో బంధించి అత్యాచారం చేశాడు. డబ్బులు ఇవ్వాలని వేధించాడు.

ఈ క్రమంలో మహిళ కన్పించకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోనికి దిగిన పోలీసులు మహిళ కోసం పోలీసులు ఆచూకి కోసం ఆ ప్రాంతమంతా వెతికారు. చివరకు ఒక ఇంట్లో మహిళను కనుగొన్నారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి ఒక పాప కూడా ఉంది. అయితే.. ఆమెను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని సంజయ్ శర్మగా పోలీసులు గుర్తించారు. అతనికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మహిళ ఆస్పత్రిలో కోలుకుంటుంది.

ఇదిలా ఉండగా తెలంగాణాలోని  గుంటూరు జిల్లా పొనకేపల్లికి చెందిన SK సుభానీ నెల్లూరులోని 3టౌన్ SI గా పనిచేస్తున్న సమయంలో అదే పోలీసు స్టేషన్ ‌లో కానిస్టేబుల్ ‌గా పనిచేస్తున్న నెల్లూరు జిల్లా బిట్రగుంటకి చెందిన లక్ష్మి ప్రసన్న అనే అమ్మాయిని ప్రేమించాడు. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించి ఎస్‌కే సుభానీ, లక్ష్మీప్రసన్నకు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి జరిగే వరకు జరిగిన కొన్ని రోజుల వరకు అంతా బాగానే సాగింది.

పెళ్లయిన కొద్దిరోజులకే సుభానీలోని అసలు రూపం బయటపడింది. మృగంలా మారి తనను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడని భార్య లక్ష్మీ ఆరోపించారు. మారతాడు అని ఎన్నోసార్లు సద్దుకుని పోయినా మార్పు రాలేదని.. ఇంతలో తాను గర్భం దాల్చినట్లు లక్ష్మీప్రసన్న తెలిపారు.

First published:

Tags: Crime news, Female harassment, Rajasthan

ఉత్తమ కథలు