హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఉపాధ్యాయుడి అరాచకం.. ఒక పదం తప్పుగా పలికినందుకు బాలుడికి చిత్రహింసలు..

ఉపాధ్యాయుడి అరాచకం.. ఒక పదం తప్పుగా పలికినందుకు బాలుడికి చిత్రహింసలు..

బాలుడు నిఖిత్ దోహే (ఫైల్)

బాలుడు నిఖిత్ దోహే (ఫైల్)

Uttar pradesh: బాలుడిని ఉపాధ్యాయుడు క్లాసులో చిత్రహింసలకు గురిచేశాడు. కర్రలతో, రాడ్ లతో ఇష్టమోచ్చినట్లు కొట్టాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన తమ వృత్తికే మాయని మచ్చగా మిగులుతున్నారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన, పిల్లలపట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు తాగి పాఠశాలకు వస్తున్నారు. మరికొందరు తోటి మహిళా ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఇంకొందరు టీచర్లు.. ఏకంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని చోట్ల పిల్లలు చదువు విషయంలో తప్పులు చేస్తు, టీచర్లు దండించడం కామన్. కానీ కొందరు అతిగా మాత్రం అతిగా ప్రవర్తించి విద్యార్థి ప్రాణాలు పోయేలా ప్రవర్తిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లోని (Uttar Pradesh) ఔరయ్యా జిల్లాలో షాకింగ్ ఘటన సంభవించింది. 15 ఏళ్ల దళితుడు 10 వతరగతి చదువుకుంటున్నాడు. అతను సోషల్ ఎగ్జామ్ లో ఒక పదం తప్పుగా రాశాడు. దీంతో ఉపాధ్యాయుడు అశ్వినిసింగ్ బాలుడిని చిత్రహింసలు పెట్టాడు. అంతే కాకుండా కర్రలు,రాడ్ లతో దాడిచేశాడు. దీంతో బాలుడు నిఖిత్ దోహే అనే అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు. దీంతో బాలుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే బాలుడు పరిస్థితి సీరియస్ గామారింది. దీంతో అతడిని అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో బాలుడు మరణించాడు. కాగా, బాలుడి చికిత్స కోసం సదరు ఉపాధ్యాయుడు.. మొదట ₹ 10,000, ఆపై మరో ₹ 30,000 ఇచ్చారని, అయితే తర్వాత అతగాడి ఫోన్ కాల్స్ రావడం మానేసిందని తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. టీచర్‌ని నిలదీయగా కులం పేరుతో దూషించాడని బాలుడి తండ్రి పోలీసులకు చెప్పాడు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.

ఇదిలా ఉండగా అర్దరాత్రి ముంబైలోని (Mumbai)  మలాడ్ వీధిలో ఇద్దరు మహిళలు చోరికి వచ్చారు. అయితే.. అలర్ట్ అయిన మహిళలు వారిని చుట్టుపక్కలవారు వెంటనే మెల్కొన్నారు.

మహిళలను పట్టుకున్నారు. అయితే.. వారు తొలుత మహిళలు పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా భావించారు. ఈ క్రమంలో.. ఇద్దరిని పట్టుకుని బట్టలు తీయించారు. అయితే.. మహిళలుమాత్రం తాము..కేవలం చోరీకి వచ్చామని, పిల్లలను ఎత్తుకుపోయే ముఠా కాదని చెప్పారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Uttar pradesh

ఉత్తమ కథలు