స్తంభానికి కట్టేసి చితకబాది.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం..

చంగలివాలా గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన రింకు సహా మరికొంతమందికి మధ్య అక్టోబర్ 21న వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. కానీ..

news18-telugu
Updated: November 16, 2019, 1:50 PM IST
స్తంభానికి కట్టేసి చితకబాది.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పంజాబ్‌లోని సంగ్‌రుర్ జిల్లా చంగలివాలా గ్రామంలో దారుణం జరిగింది. ఓ దళిత వ్యక్తిని స్తంభానికి కట్టేసి చావబాదిన నలుగురు గ్రామస్తులు.. అతని చేత బలవంతంగా మూత్రం తాగించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో పీజీఐఎంఈఆర్‌లో చికిత్స పొందుతున్నాడని.. స్థానిక సూపరిండెంట్ పోలీస్ సందీప్ గార్గ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..చంగలివాలా గ్రామానికి చెందిన ఓ దళిత వ్యక్తికి, అదే గ్రామానికి చెందిన రింకు సహా మరికొంతమందికి మధ్య అక్టోబర్ 21న వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.

ఇదే క్రమంలో ఓరోజు రింకు ఆ దళిత వ్యక్తిని తన ఇంటికి పిలిచాడు. జరిగిన గొడవపై మాట్లాడుతుండగానే.. రింకు స్నేహితులు నలుగురు ఆ దళిత వ్యక్తిని ఓ స్తంభానికి కట్టేశారు.అనంతరం అతన్ని చితకబాదారు. దాహంతో అల్లాడిపోయిన బాధితుడు.. నీళ్లు ఇప్పించాలని కోరగా.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ ఎస్సీ,ఎస్టీ కమిషన్ దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సంగ్‌రుర్‌ ఎస్పీని కోరింది. మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని కమిషన్ అధికారులు తెలిపారు.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు