• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • DALIT LABOURER PREGNANT WIFE RAPED IN FRONT OF CHILDREN IN MADHYA PRADESH SU

పిల్లల ముందే దళిత మహిళపై అత్యాచారం.. కిడ్నాప్ చేసి దారుణం.. ఆ కారణంతో చిత్ర హింసలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ దళిత మహిళను కిడ్నాప్ చేసిన దుండగుడు నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు. మహిళ పిల్లల ముందే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

  • Share this:
    అనారోగ్యంగా ఉన్నాను.. ఈ పనిచేయలేను అని చెప్పడమే ఓ దళిత కార్మికుడి పాలిట శాపంగా మారింది. పని చేయ్యనని చెప్పినందుకు అతని కోపం పెంచుకున్న నిందితుడు.. అతనిపై దాడికి దిగాడు. అంతేకాకుండా అతని భార్య, ఇతర కుటుంబ సభ్యులను అపహరించి నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అయితే నిందితుడు తనపై లైంగిక దాడి చేశాడని.. తన పిల్లల ముందే ఈ దారుణానికి పాల్పడ్డాడని కార్మికుడి భార్య ఆరోపించింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లో ఛతర్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని ఓ గ్రామంలోని భూస్వామి పొలంలో చెట్లు నరికివేసేందుకు ఓ కార్మికుడు నిరాకరించాడు. తనకు అనారోగ్యంగా ఉందని.. అందుకే ఆ పని చేయలేనని చెప్పాడు. దీంతో నిందితులు శిక్ష విధించాలని భావించి.. అతనిపై దాడికి దిగారు. ఆ తర్వాత నిందితులు కార్మికుడి ఇంటికి వెళ్లి.. అతని భార్యపై దాడి చేశారు. ఆమె గర్భవతి అని కూడా కొట్టారు. అనంతరం కార్మికుడి భార్యను, ఇద్దరు పిల్లల్ని, తల్లిని అపహరించి.. నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారు.

    ఈ విషయం తెలుసుకున్న ఒక జర్నలిస్టు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ దళిత కుటుంబాన్ని రక్షించారు.. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

    బంగ్లా యువతి గ్యాంగ్ రేప్‌ కేసులో కీలక మలుపు.. నిందితుల్లో ఇద్దరు యువతులు.. బాధిత యువతిని ట్రేస్ చేసిన పోలీసులు..

    పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. చివరకు వధువు చెల్లెలితో వరుడి పెళ్లి.. అసలేం జరిగిందంటే

    లేడీ కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డ ఎస్ఐ.. డ్యూటీలో ఉన్న సమయంలో..

    ఇక, గురువారం కార్మికుడి భార్య సంచనల ఆరోపణలు చేసింది. ప్రధాన నిందితుడు తన పిల్లల ముందే తనపై అత్యాచారం చేశాడరని ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొనలేదని తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారం జరిగినట్టు కార్మికుడి భార్య తమకు తెలుపలేదని పోలీసులు చెప్పారు. ‘మహిళ తన ఒంటిపై గాయాలు ఉన్నట్టు మాత్రమే ఫిర్యాదులో పేర్కొంది. భౌతిక దాడి గురించి మాత్రమే పోలీసులకు సమాచారం ఇచ్చింది. లైంగిక దాడి జరిగినట్టు చెప్పలేదు. కానీ.. ఒకవేళ ఆమె చెబితే.. ఎఫ్‌ఐఆర్‌లో రేప్ కేసును జత చేస్తాం’ ఛతర్పూర్ ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: