హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : తన కుండలోని మంచినీళ్లు తాగాడని..దళిత విద్యర్థిని కొట్టి చంపిన టీచర్

Shocking : తన కుండలోని మంచినీళ్లు తాగాడని..దళిత విద్యర్థిని కొట్టి చంపిన టీచర్

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Dalit Boy Beaten To Death: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ మ‌న సమాజం అంటరానితనం నుంచి ఇంకా విముక్తి పొంద‌లేదు. ద‌ళితుల‌పై దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Dalit Boy Beaten To Death: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నప్పటికీ మ‌న సమాజం అంటరానితనం నుంచి ఇంకా విముక్తి పొంద‌లేదు. ద‌ళితుల‌పై దాడులు జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా స్కూల్ లో తనకోసం ఉంచిన కుండలోని మంచినీళ్లు తాగాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని టీచర్ విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆ బాలుడు ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందాడు. రాజస్తాన్‌(Rajastan)లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

రాజస్తాన్‌ రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని సురానా గ్రామానికి చెందిన ఇందర్ మేఘవాల్ (9) అనే దళిత బాలుడు అదే గ్రామంలోని సరస్వతీ విద్యా మందిర్ అనే ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే జూలై 20వ తేదీన మేఘవాల్ స్కూల్ కి వెళ్లాడు. మేఘవాల్ స్కూల్ లో ఉన్న స‌మ‌యంలో దాహమేసి క్లాస్ రూమ్ లో టీచర్ కోసం ప్రత్యేకంగా ఉంచిన కుండలోని నీళ్లు తాగాడు. దీంతో ఆ చైల్ సింగ్ (40) అనే టీచర్ ఆగ్రహంతో ఊగిపోయి ఆ బాలుడిని కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టాడు. కళ్లు, ముఖ భాగంలో తీవ్ర గాయాలవడంతో మేఘవాల్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం గుజరాత్ లోని అహ్మదాబాద్ కు పంపించారు. కాగా అప్ప‌టి నుంచి అక్క‌డే చికిత్స పొందుతున్న బాలుడు శ‌నివారం సాయంత్రం 4 గంట‌ల‌కు ప‌రిస్థితి విష‌మించి మ‌ర‌ణించాడు.

China Spy Ship : భారత్ పై నిఘా కోసం చైనా షిప్..ఆ పోర్ట్ లో నిలిపేందుకు శ్రీలంక అనుమతి!

ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేస్తూ కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం జరిగేలా చూస్తామని, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం అందజేస్తామని ఆయన ట్వీట్ చేశారు.

నిందితుడైన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి ఎస్సీ-ఎస్టీ చట్టం కింద హత్య కేసు నమోదు చేశారు. "మేము సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసాము. ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి విచారిస్తున్నాము" అని కేసు దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సత్వర విచారణ జరిపి నివేదిక అందజేయాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ అధికారులను ఆదేశించింది. బాధిత కుటుంబాన్ని ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా ఆగస్టు 15వ తేదీన క‌ల‌వ‌నున్నారు.

First published:

Tags: Crime news, Rajastan

ఉత్తమ కథలు