రోజు కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల షాక్...రూ.1 కోటి జరిమానా కట్టాలని నోటీస్

అతడు రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నాడు. అతడికి ఉన్న పళంగా ఐటీ శాఖ నుంచి ఒక నోటీసు వచ్చింది. అందులో దాదాపు కోటి రూపాయల సొమ్మును పన్ను అలాగే అపరాధరుసుముతో కలిపి కట్టాలని ఉంది. దీంతో అతడు భయపడిపోయాడు.

news18-telugu
Updated: January 16, 2020, 1:50 PM IST
రోజు కూలీకి ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల షాక్...రూ.1 కోటి జరిమానా కట్టాలని నోటీస్
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రోజు కూలీ చేసుకునే వ్యక్తికి కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలని నోటీసులు అందాయి. దీంతో ఆ పేద జీవి లబో దిబో మంటున్నాడు. వివరాల్లోకి వెళితే ముంబైలోని అంబివలి బస్తీలో బాబు సాహెబ్ అనే వ్యక్తి దినసరి కూలీగా జీవితం గడపుతున్నాడు. అతడు రోజంతా కష్టపడితే రూ.300 సంపాదిస్తున్నాడు. అతడికి ఉన్న పళంగా ఐటీ శాఖ నుంచి ఒక నోటీసు వచ్చింది. అందులో దాదాపు కోటి రూపాయల సొమ్మును పన్ను అలాగే అపరాధరుసుముతో కలిపి కట్టాలని ఉంది. దీంతో అతడు భయపడిపోయాడు.  తనకు వచ్చిన నోటీసులు తీసుకుని నేరుగా పోలీసుల వద్దకు వెళ్లాడు. అయితే విచారణలో తేలిన అసలు విషయం ఏమిటంటే...2016లో డీమానిటైజేషన్ సమయంలో బాబు సాహెబ్ అకౌంట్లో గుర్తు తెలియని వ్యక్తులు రూ.58లక్షలు డిపాజిట్ చేసినట్లు తేలింది.

అయితే ఈ విషయం తనకు తెలియదని పోలీసులతో మొరపెట్టుకున్నాడు ఆ వ్యక్తి. కాగా ఐటీ ఆఫీసు అలాగే బ్యాంకుకు వెళ్లి కనుక్కుంటే అతని పాన్ కార్డు మీద అకౌంట్ ఓపెన్ అయినట్లు తెలిసింది కానీ, వేరే వ్యక్తి ఫొటో, ఫోర్జరీ సంతకాలు ఉన్నాయి.

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>