Home /News /crime /

DAILY MIDNIGHT PSYCHO TENSION IN VIJAYAWADWA COLONY WOMEN COMPLIANT TO POLICE NGS

Andhra Pradesh: అర్థరాత్రి ఇంట్లోకి వస్తాడు.. మహిళల పక్కనే పడుకుంటాడు? వారికి మెలుకువ వస్తే మాయం అవుతాడు

psycho tension in vijayawada

psycho tension in vijayawada

అర్థరాత్రి అయ్యిందంటే చాలు అక్కడి మహిళలు భయం భయంగా గడుపుతున్నారు. నిద్రపోతే అపరిచుతుడు వచ్చి పక్కన పడుకుంటాడనే భయంతో.. నిద్రకు దూరమవుతున్నారు. ఇంతకీ ఆ అపరిచితుడు ఎవరు..? ఎందుకు మహిళల పక్కకు వస్తున్నాడు..

    మహిళలు ఒంటరిగా ఇంట్లో పడుకోవాలి అంటే భయపడుతున్నారు. అపరిచితుడు అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించి తమ పక్కనే వచ్చి పడుకుంటాడు.. వారికి మెలుక వచ్చి ఎవరని ప్రశ్నిస్తే మాయమవుతాడు.. గత కొన్ని రోజులుగా చుట్టు పక్కల ఇళ్లలో జరుగుతున్న తంతు ఇది. దీంతో అసలు రాత్రి అయ్యిందంటే చాలు మహిళలు భయపెడుతున్నారు. సరిగ్గా అర్థరాత్రి 2 గంటల నుంచి 3 గంటల సమయం. మిగిలిన ప్రపంచంలానే ఆ ప్రాంత మహిళలు ఆ సమయంలో గాఢనిద్రలో మునిగి ఉంటారు. అన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో వారికి హఠాత్తుగా మెలకువ వస్తుంది. చూస్తే పక్కనే ఓ అపరిచిత వ్యక్తి పడుకుని ఉంటాడు. దీంతో ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయి కేకేలు వేస్తారు. అందరూ లేస్తే ప్రమాదమని ఆ అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి పరారవుతున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినా ఆ అపరచితుడి జాడ దొరకలేదు. అతడి అల్లరి పనులు ఆగలేదు.

    ఎవరో పరిచయం లేని వ్యక్తి వేళ కాని వేళలో చిమ్మచీకట్లో వారి ఎదురుగా ఉంటాడు. ఊహించడానికే భయం కలిగించే ఈ ఘటన విజయవాడ అయ్యప్పనగర్ లో తరుచుగా జరుగుతోంది. ఓ సైకో విపరీత ప్రవర్తన, వికృత చర్యలు, వెకిలి చేష్టలతో స్థానిక మహిళలు రాత్రి అయ్యిందంటే చాలు భయంతో వణికిపోతున్నారు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అయితే అలా ఇంట్లోకి వచ్చిన సైకో సైలెంట్ గా పడుక్కోవడమే తప్పా.. ఎలాంటి బెదిరింపులకు దిగినట్టు ఫిర్యాదులు అందలేదు అంటున్నారు పోలీసులు.

    సైకో తీరుతో తీవ్ర భయాందోళన చెందుతున్నామని మహిళలు అంటున్నారు. సైకోని పోలీసులు పట్టుకునే దాకా తమకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైకోని పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నామని, మూడు బృందాలు ఏర్పాటు చేశామని, మహిళలు భయపడొద్దని పోలీసులు చెప్పారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Psycho, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు