DAILY LABOUR WOMEN BECOME A SKELETON IN KAMAREDDY VRY NZB
kamareddy : పరిచయం ఉన్న మేస్త్రీతో కలిసి వెళ్లింది..కుళ్లిన శవంగా మారింది... !
kamareddy
kamareddy : కూలిపనికి పోయిన ఓ మహిళ కుళ్లిన దశలో తేలింది... గుర్తుపట్టని స్థితిలోకి మారిపోయింది.. ( Daily labour women become a skeleton )పరిచయమున్న మేస్త్రీతో వెళ్లిందని స్థానికులు చెబుతుండగా.. మృతికి అసలు కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటివల కూలీలే టార్గెట్గా అత్యాచారాలు,హత్యలు కొనసాగుతున్నాయి.. కొంతమంది మృగాళ్లు కూలీల అడ్డాలనే తమకు అనుకూలంగా మార్చుకుని ఘోరాలకు పాల్పడుతున్నారు. కూలీ పేరు మీద మహిళలను వెంట తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. దీంతో ఇటివల అనేక హత్యలు బయటపడుతున్నాయి.. ఇలా తాజాగా కూలీకి వెళ్లిన మహిళ శవంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా, కామారెడ్డి మండలం క్యాసంపల్లి తండాకు చెందిన అనిత పట్టణంలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేంది... ( Daily labour women become a skeleton ) ఇలా రోజువారిగానే ఆమె గత నెల గత నెల 15వ తేదీన ఇంటి నుండి బయలు దేరి వెళ్లింది.. ఆరోజు వెళ్లిన ఆమె ఆచూకి లభించకుండా పోయింది. తిరిగి ఇంటికి వస్తుందని కొద్ది రోజులుగా అనిత కొసం కుటుంబ సభ్యులు తెలిసిన వారిని వాకాబ్ చేసారు.. కానీ ఏలాంటి సమాచారం లభించలేదు..
అయితే ఈ రోజు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి దేవి విహార్ సమీపంలోని కంది చేను లో ఓ మహిళ శవం కుల్లిపోయిన స్థితిలో స్థానికులకు కనిపించింది.. దీంతో స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు.. ( Daily labour women become a skeleton )సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ ఎవరు అనే కోణంలో విచారించారు.. చివరకు గత నెలలో అదృశ్యమైన కామారెడ్డి మండలం క్యాసంపల్లి తాండకు చెందిన విస్లావత్ అనిత మృతదేహంగా గుర్తించారు.. అనిత మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన ఉండడంతో సంఘటనా స్థలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు.
ఆమె మృత దేహం లభ్యంపై స్థానిక రూరల్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు అనిత లింగంపేట మండలంకు చెందిన మేస్త్రి ప్రకాష్ తో అనితకు పరిచయం ఉండడంతో తరచు అయనతో కలిసి కూలి పనికి వెళ్లేదని తెలిపారు.. ( Daily labour women become a skeleton ) ఇదే క్రమంలో గత నెల 15వ తేదీన ప్రకాష్ తో కలిసి వెళ్ళిందని చెప్పారు. కాగా అదే రోజు కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవుని పల్లి గ్రామ శివారులొని కంది చేను వద్ద డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.. ( Daily labour women become a skeleton ) ఆ రోజే హత్య చేసి ఉండవచ్చునని తెలిపారు. ప్రస్తుతం కాల్ డేటా ఆధారంగా ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.