హోమ్ /వార్తలు /క్రైమ్ /

రూ.250 ఇచ్చారు.. రూ.50వేలు కొట్టేశారు.. ఏలాగో తెలుసా..?

రూ.250 ఇచ్చారు.. రూ.50వేలు కొట్టేశారు.. ఏలాగో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎదైనా అకౌంట్‌ను హ్య‌క్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స‌మ‌చారం వ‌చ్చిన త‌ర్వాత మ‌న అకౌంట్‌లో డ‌బ్బులు ఇట్టే మాయం చేస్తారు.

గోపి ఎప్ప‌టిలాగే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం లో భాగంగా ఇంటి వ‌ద్ద ఉండే ఆఫీస్ ప‌ని చూసుకుంటున్నాడు. స‌డెన్‌గా త‌న ఫోన్‌కి రూ.250 త‌న అకౌంట్‌లో క్రెడిట్ అయిన‌ట్లు మెసేజ్ వ‌చ్చింది. త‌న గూగుల్ పేలో రూ.250 యాడ్ అయిన‌ట్లు కూడా క‌నిపిస్తోంది. ఈ మెసెజ్ వ‌చ్చిన 15 నిముషాల‌కు ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర నుంచి గోపీకి కాల్ వ‌చ్చింది. సార్, పొర‌పాటున నా ఫ్రెండ్‌కి పంపాల్సిన డ‌బ్బులు మీ నెంబ‌రుకి పంపాను. కాస్త ఏమీ అనుకోకుండా ఆ డ‌బ్బులు వెన‌క్కి పంపిస్తారా? అంటూ అడిగారు. దాంతో గోపీ అందులో ఏంముంది.. ఇప్పుడు సెండ్ చేస్తా అంటూ త‌న‌కు వ‌చ్చిన రూ.250 వెన‌క్కి పంపేశాడు. ఇది జ‌రిగిన ఒక గంట త‌ర్వాత గోపీ ఫోన్‌కు మ‌రో మెసెజ్ వ‌చ్చింది. ఆ మెసెజ్ చూసిన గోపీకి షాక్ త‌గిలినంత పనయ్యింది. అప్పుడే త‌న అకౌంట్‌లో పడిన త‌న వేతనం రూ.50 వేలు డెబిట్ అయినట్టు మెసెజ్ వ‌చ్చింది.

ఒక్క క్ష‌ణం గోపికి ఏం అర్ధం కాలేదు. ఇది ఎలా సాధ్యం అని క‌స్ట‌మ‌ర్ కేర్‌కి కాల్ చేశాడు. 48 గంట‌ల త‌ర్వాత గోపీ అకౌంట్ త‌న అనుమ‌తితోనే హ్య‌క్ చేయ‌డం ద్వారా సైబ‌ర్ క్రైమ్ నేర‌గాళ్లు త‌న డ‌బ్బులు మాయం చేశార‌ని తెలుసుకున్నాడు. స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌న‌లే ఇప్పుడు న‌గ‌రంలో చాలా చోట్ల జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు సైబ‌ర్ క్రైమ్‌లో ఓటీపీలు చెప్ప‌డం.. వాటి ద్వారాడ‌బ్బులు కాజేయ‌డం చూశాం. కానీ ఇప్పుడు ఈ కేటుగాళ్లు స‌రికొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఓటీపీలపై ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అవ‌గాహాన రావ‌డంతో ఇది వ‌ర్క్ అవుట్ కాద‌నుకున్నారేమో. ఇప్పుడు ఈ సైబ‌ర్ దొంగ‌లు రూటు మార్చారు.

బాధితుల అకౌంట్‌కే డ‌బ్బులు పంపించి త‌రువాత వాళ్ల‌కే ఫోన్ చేసి పొరపాటున ఎవ‌రికో సెండ్ చేయాల్సిన మ‌నీ మీకు సెండ్ చేశాం అంటూ తిరిగి పంపించాలని రిక్వ‌ెస్ట్ చేస్తారు. ఈ త‌తంగంలో ఎక్క‌డ ఎవ‌రికి అనుమానం రాదు. ఇందులో ఎముంది త‌న డ‌బ్బులు త‌న‌కి పంపిస్తే మ‌న‌కి వ‌చ్చే న‌ష్టం ఏంట‌ని అందరూ అనుకుంటారు. కానీ ఇక్క‌డ ప‌ప్పులో కాళ్లేస్తాం. ఇలా మ‌నకు వ‌చ్చిన డ‌బ్బుల‌ను త‌మ అకౌంట్‌కు పంపించే క్ర‌మంలోనే మ‌న అకౌండ్ డిటైల్స్ అన్ని తీసుకుంటారు. ఎదైనా అకౌంట్‌ను హ్య‌క్ చేయ‌డానికి అవ‌స‌ర‌మైన స‌మ‌చారం వ‌చ్చిన త‌ర్వాత మ‌న అకౌంట్‌లో డ‌బ్బులు ఇట్టే మాయం చేస్తారు.

గ‌డిచిన రెండు వారాలుగా న‌గ‌రంలో ఇలాంటి కేస‌ుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెర‌గ‌డంతో ఇప్పుడు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఈ కేటు గాళ్లుపై దృష్ఠి సారించారు. వీరు అకౌంట్‌ను డ‌బ్బులు దొంగ‌లించే విధానం చూసి పొలీసులే ముక్క‌న వేలేసుకుంటున్నారు. ఇంకో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ సైబ‌ర్ నేర‌గాళ్లలో చాలా మంది ఉన్న‌త విద్య పూర్తి చేసినవారు.. హ్యాకింగ్ పై చాలా ప‌ట్టున్న వ్య‌క్తులే అవ‌డం ఇక్క‌డ చాలా కీల‌క‌మైన అంశం.

ప్ర‌త్యేక‌మైన అప్లీకేష‌న్స్‌ను రూపోందించ‌డం ద్వారా బాధితుడు డ‌బ్బులు వెన‌క్కి పంపించే క్ర‌మంలోనే వారికి సంబంధించిన అన్ని వివరాలు సేక‌రిస్తోన్నారు. దీంతో న‌గ‌రంలో ఉన్న సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అల‌ర్టయ్యారు. అప‌రిచిత వ్య‌క్తుల‌కు త‌మ స్పందించ‌క‌పోవ‌డ‌మే మంచి మార్గం అని విజ్ఞ‌ప్తి చేస్తోన్నారు. ఇదిలా ఉంటే.. ఈ నేర‌గాళ్లు ప్ర‌ధానంగా గూగుల్ పే, పేటీమ్, ఫోన్ పే వంటి వాటిని టార్గెట్‌గా ఈ మోసాల‌కు పాల్పడుతున్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు.

First published:

Tags: CYBER CRIME, Google pay, Hacking