హోమ్ /వార్తలు /క్రైమ్ /

ప్రధాని మోదీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పి...జనగామ జిల్లాలో ఘరానా మోసం...

ప్రధాని మోదీ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పి...జనగామ జిల్లాలో ఘరానా మోసం...

నమిలిగొండ గ్రామం బోర్డు..

నమిలిగొండ గ్రామం బోర్డు..

ప్రజలందరికీ పీఎం నరేంద్ర మోదీ డబ్బులు వేస్తున్నారని చెప్పడంతో అందరూ నమ్మి వారి ఆదార్ నెంబర్ తో పాటు వేలి ముద్రలు ఇచ్చారు. అందరి నెంబర్లను తీసుకున్న హ్యాకర్లు వెంటనే వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశారు. దీంతో ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతా నుంచి 600రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ లు రావడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.

ఇంకా చదవండి ...

జనగాంలో భారీ స్కాం జరిగింది. మోదీ డబ్బులు వేస్తాడని చెప్పి...కొత్తగా హ్యాకర్లు గ్రామాల బాట పట్టారు. ఇంతకు ముందు ఫోన్లో అడిగి ఓటీపీ నంబర్ తో డబ్బులు తీసుకోవడం..బహుమతుల పేరుతో ప్రజలను మోసం చేయడం చూసాం కానీ ఏకంగా గ్రామంలోకి వెళ్లి వారి ఆదార్ కార్డుతో డబ్బులు డ్రాచేసిన ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండ గ్రామంలో భారీ స్కాం వెలుగుచూసింది. గ్రామ ప్రజలకు మాయమాటలు చెప్పిన హ్యాకర్లు వారి వద్ద నుంచి డబ్బులు మాయం చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...స్టేషన్ ఘనపూర్ మండలం కొత్తగా జనగామాజిల్లాలో కలిసింది. నమిలిగొండ గ్రామం జనగామా జిల్లాలో కలిసినందు వల్ల జిల్లా పేరును ఆదార్ కార్డులో మారుస్తున్నామని వచ్చిన కొందరు హ్యాకర్లు ప్రజల నుంచి ఆదార్ నెంబర్లు తీసుకున్నారు. అందరి ఆదార్ నెంబర్లతో పాటు వారి చేతి ముద్రలు కూడా సేకరించారు.

అలాగే ప్రజలందరికీ పీఎం నరేంద్ర మోదీ డబ్బులు వేస్తున్నారని చెప్పడంతో అందరూ నమ్మి వారి ఆదార్ నెంబర్ తో పాటు వేలి ముద్రలు ఇచ్చారు. అందరి నెంబర్లను తీసుకున్న హ్యాకర్లు వెంటనే వారి ఖాతాల నుంచి డబ్బులు మాయం చేశారు. దీంతో ఊరి ప్రజలంతా లబోదిబో మన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతా నుంచి 600 రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ లు రావడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దాదాపుగా 20లక్షల రూపాయల స్కాం జరిగినట్టు సమాచారం. అయితే మళ్లీ తమ అకౌంట్ లో నుంచి డబ్బులు కట్ అవుతాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime, CYBER CRIME, Nalgonda, Pm modi

ఉత్తమ కథలు