షాద్ నగర్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌ను సస్పెండ్ చేశారు. బాధితురాలు కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా సకాలంలో పట్టించుకోకపోవడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనే ఆరోపణలతో వారిపై వేటు వేశారు. షాద్‌నగర్ బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదంటూ తిప్పారని, చివరకు ‘ఎవరితో అయినా వెళ్లపోయిందేమో’ అని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇకపై ఎవరైనా ఫిర్యాదు చేసేందుకు వస్తే.. తమ పోలీస్ స్టేషన్ కాదంటూ తప్పి పంపవద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్లు అందరికీ ఆదేశాలు జారీ చేశారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.