CYBERABAD POLICE DUGOUT MOBILE PHONE OF VETERINARY DOCTOR DISHA BA
దిశ హత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యం.. పాతిపెట్టిన దాన్ని బయటకు తీసి...
దిశ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ రేప్ అండ్ మర్డర్ కేసు ఆధారంగా వర్మ ఈ చిత్రం అనౌన్స్ చేసాడు. షూటింగ్ మొదలుపెట్టి ఆపేసాడు వర్మ. మరి ఇది వస్తుందా లేదా అనేది చూడాలిక.
తొలుత దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే దానిని పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.
హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశ మీద హత్యాచార ఘటనకు సంబంధించి మరో కీలక ఆధారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే దానిని పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఘటనాస్థలంలో బ్రిడ్జి క్రింద మట్టిని తవ్వి సెల్ ఫోన్ పూడ్చిపెట్టారు నిందితులు. క్లూస్‌టీమ్ తనిఖీలు నిర్వహించి ఆ సెల్ ఫోన్ ను సేకరించింది. ఇప్పటికే పోలీసులు ఆ సెల్‌ఫోన్ ఆధారంగా కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్నారు. ఇక దీని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. టోల్ గేట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సంఘటన జరిగిన చోట దిశకు సంబంధించిన పర్సు, డెబిట్ కార్డు, చున్నీ, లాకెట్, ఐడీ కార్డు, లోదుస్తులు, జీన్ ఫ్యాంట్, చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే సంఘటనా స్థలంలో ఉన్న కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.