‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..

VC Sajjanar : వీసీ సజ్జనార్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థుల పాలిట సింహస్వప్నం.. అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తే యమపాశం విసురుతారు.. అందుకే తక్షణ న్యాయం చేయడానికి అస్సలు వెనుకాడరు.

news18-telugu
Updated: December 6, 2019, 1:58 PM IST
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్
  • Share this:
వీసీ సజ్జనార్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. నేరస్థుల పాలిట సింహస్వప్నం.. అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తే యమపాశం విసురుతారు.. అందుకే తక్షణ న్యాయం చేయడానికి అస్సలు వెనుకాడరు. 2008లో వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. 2019లో దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అయినా.. తనకు తానే సాటి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో మరోసారి హైలైట్ అయిన సజ్జనార్ ఎవరు? ఆయన ట్రాక్ రికార్డు ఏంటి? తదితర విషయాలు తెలుసుకుందాం. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా కేంద్రం హుబ్బలికి చెందిన ఈయన 1996 ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్. ప్రస్తుతం ఇస్పెక్టర్ జనరల్-ఐజీ ర్యాంకు అధికారిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన..జనగాంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన కెరీర్ మొదలు పెట్టారు. క్రమశిక్షణ, ముక్కుసూటి తనం తన ఆయుధాలుగా పోలీస్ శాఖలో ప్రత్యేకత సంపాదించుకున్నారు. ఆమ్‌వే కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆయన మల్టీ లెవల్ మార్కెటింగ్ బిజినెస్‌ను అరికట్టడంలో కీలకంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన క్యూనెట్ స్కాంపైనా కేసులు నమోదు చేసి తనేంటో నిరూపించుకున్నారు.

అంతేకాదు.. మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి కేసులో కీలక సూత్రధారిగా భావించిన నక్సల్స్ నేత సుధాకర్ రెడ్డి ఎన్‌కౌంటర్‌లోనూ సజ్జనార్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు. ఇక, గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌లోనూ ఈయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఈయన స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా పనిచేశారు. ఆ తర్వాత.. 2018 మార్చి 14న సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.

వృత్తిపరంగా తన కింది ఉద్యోగులతో సజ్జనార్ అన్యోన్యంగా ఉంటారని, కింది ఉద్యోగులు కూడా ఆయన్ను చాలా ఇష్టపడతారని అంటుంటారు. స్వతహాగా శాకాహారి అయిన సజ్జనార్.. ప్రతి రోజు గంట పాటు పూజలు కూడా చేస్తారట. ఎంబీఏ పూర్తి చేసిన సజ్జనార్.. అనుపను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>