ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు వద్దంటున్న పోలీసులు

కరోనా సంక్షోభ సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు.

news18-telugu
Updated: July 13, 2020, 1:31 PM IST
ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు వద్దంటున్న పోలీసులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ నేరాలు పోలీసులకు ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. అయితే ఎక్కువగా వినియోగదారులు సైబర్ నేరాలకు గురవుతున్న ఓఎల్‌ఎక్స్‌పై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కేంద్రానికి లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఓఎల్‌ఎక్స్‌ వల్ల ఇప్పటికే అనేక మంది ప్రజలు సైబర్ నేరాలకు గురయ్యారని... చాలా డబ్బు నష్టపోయారని పోలీసులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఓఎల్‌ఎక్స్‌పై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తుండటంతో... ఓఎల్‌ఎక్స్‌లో కొనుగోలు, అమ్మకాలు జరపొద్దని ప్రజలకు వారు సూచిస్తున్నారు. ఓఎల్‌ఎక్స్‌ను ఆసరా చేసుకుని ప్రజలు డబ్బులను లాగేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. అవసరమైతే ఓఎల్‌ఎక్స్‌ వెబ్ సైట్‌ను నిషేధించాలని కోరతామని అంటున్నారు. మరోవైపు కరోనా సంక్షోభ సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగాయని పోలీసులు చెబుతున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading