Home /News /crime /

CYBERABAD CYBER CRIME POLICE HAVE ARRESTED A GANG THAT CLONING A CREDIT CARDS IN RECENT TIMES WORTH RS 50 CRORE IN HYDERABAD PRV

Cyber crime: వీళ్లు మామూలోల్లు కాదుగా..  80 మంది కలిశారు.. ఏకంగా రూ. 50 కోట్లు దోచేశారు.. ఎలా చిక్కారో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సైబర్ నేరాలకు (Cyber crime) పాల్పడుతున్న క్రిమినల్స్.. ఆన్‌లైన్ పేరుతో అనేక మోసాలకు తెరతీస్తున్నారు... వ్యక్తుల మానసిక బలహీనతలే పెట్టుబడిగా కొనసాగిస్తూ... గిఫ్టులు, వ్యాపారాలు, సర్వీసుల పేరుతో బురిడి కొట్టిస్తున్నారు.

    డబ్బు సంపాదించడమే ధ్యేయంగా సైబర్ నేరాలకు (Cyber crime) పాల్పడుతున్న క్రిమినల్స్.. ఆన్‌లైన్ పేరుతో అనేక మోసాలకు తెరతీస్తున్నారు... వ్యక్తుల మానసిక బలహీనతలే పెట్టుబడిగా కొనసాగిస్తూ... గిఫ్టులు, వ్యాపారాలు, సర్వీసుల పేరుతో బురిడి కొట్టిస్తున్నారు. (Cyber criminal threaten victim ) అయితే ఇలా బురిడి కొట్టించిన వారు.. బాధితుడి నుండి డబ్బులు తీసుకున్న తర్వాత సైలంట్ అవుతారు. తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు.  ఇలా 80 మందితో ఏర్పడ్డ ముఠా రూ.50 కోట్లు కొట్టేశారు. విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డు( International credit card)లే లక్ష్యంగా క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను సైబారాబాద్ పోలీసులు (Cyberabad Police) వల పన్ని పట్టుకున్నారు .

    క్రెడిక్​ కార్డు యాక్టివేట్ చేస్తామని..

    బ్యాంకు వినియోగదారులే (bank customers) టార్గెట్‌గా మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠా, క్రెడిట్ కార్డు బ్లాక్ (Credit card block) అయిందని, పూర్తి వివరాలు ఇస్తే వెంటనే యాక్టివేట్ చేస్తామని చెబుతుంటారని  సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర వివరించారు. ఆ తర్వాత ఆ వివరాలతో ఆ కార్డులను క్లోనింగ్ చేసి, ఆన్‌లైన్ ద్వారా విదేశాల్లో ఆ కార్డులను విక్రయిస్తున్నారని తెలిపారు.

    ఇలా ఎక్కువగా విదేశీ ప్రయాణికుల కార్డులు, అంతర్జాతీయ బ్యాంకుల క్రెడిట్ కార్డులే లక్ష్యంగా వీరు మోసాలకు పాల్పడ్డారని సైబరాబాద్ సీపీ స్టిఫెన్ రవీంద్ర (Cyberabad CP Stephen Ravindra) చెప్పారు . వీరి మోసాలలో ముఖ్యంగా విదేశీ క్రెడిట్ కార్డ్ కంపెనీలకు ఫ్రాంచైజీగా ఉన్న పలు భారతీయ బ్యాంక్‌లకు ఈ గ్యాంగ్ టోకరా వేసినట్లు పోలీసులు గుర్తించారు . ఈ క్రమంలోనే భారత్‌లో 80 మందితో కాల్ సెంటర్ నిర్వహిస్తుందని, ఈ ముఠాకు, దుబాయ్‌లో ఉన్న మరో రెండు గ్యాంగ్‌లు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు .

    ఈ సైబర్‌ ముఠా నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌ (call center)పై దాడులు జరిపారు పోలీసులు. కోటి 11 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠాకి చెందిన నవీన్ బొటాని అనే కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్టు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు . ఈ ముఠా ఇప్పటివరకు 50 కోట్లకు పైగా మోసాలకు పాల్పడినట్టు పోలీసు కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర చెప్పారు.

    సైబర్ క్రైమ్ (Cyber crime) అనేది కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్, కంప్యూటర్ నెట్‌వర్క్, నెట్‌వర్క్ డివైజ్‌లే లక్ష్యంగా చేసే దాడి లేదా నేరపూరిత చర్యను సైబర్ క్రైమ్ అంటారు. అక్రమంగా డబ్బు సంపాదించాలనుకునే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు.. ఇలాంటి నేరాలకు పాల్పడతారు. వ్యక్తులు లేదా సంస్థలు ఒక ప్రణాళిక ప్రకారం ఉమ్మడి లక్ష్యం కోసం ఈ రకమైన మోసాలు చేయాలనుకుంటారు. ఒక వ్యక్తి, సంస్థ లేదా దేశ రక్షణకు, ఫైనాన్షియల్ హెల్త్‌కు సైబర్ నేరాలు ఆటకం కలిగిస్తాయి. ఇలాంటి చర్యలు చట్టవ్యతిరేకమైనవి. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైబర్ నేరాలకు కఠినమైన శిక్షలు విధిస్తున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Credit cards, CYBER CRIME, Hyderabad, Online fraud

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు