Cyber Crime: మంచి ఉద్యోగం ఇప్పిస్తామని యువతికి వల... చివరికి ఏమైందంటే

Job cheating | మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, డబ్బులు చెల్లించాలని ఓయువతికి ఇద్దరు మోసగాళ్లు వల వేశారు. చివరికి ఏం జరిగిందో తెలుసుకోండి.

news18-telugu
Updated: September 9, 2020, 2:46 PM IST
Cyber Crime: మంచి ఉద్యోగం ఇప్పిస్తామని యువతికి వల... చివరికి ఏమైందంటే
మంచి ఉద్యోగం ఇప్పిస్తామని యువతికి వల... చివరికి ఏమైందంటే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వ‌రుస‌గా జ‌రుగుతున్న సైబ‌ర్ నేరాల‌పై యువ‌త‌, నిరుద్యోగులు ఓ కన్నేసి ఉంచాల‌ని సైబ‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవ‌లి కాలంలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బు వ‌సూలు చేసిన‌ట్టు వ‌స్తున్న ఫిర్యాదులు ఎక్కువైన‌ట్టు వారు చెబుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని చెప్పే వారిని న‌మ్మ‌కూడ‌ద‌న్నారు. జాబ్ పోర్ట‌ళ్ల‌లో వివ‌రాలు అప్‌లోడ్ చేసేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు స‌రిచూసుకోవాల‌ని చెప్పారు. ఇలాంటి కేసుల‌కు సంబంధించిన కేస్‌ స్ట‌డీని పోలీసులు మీడియాకు వెల్ల‌డించారు. సెప్టెంబ‌రు రెండున న‌మోదైన ఓ కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు

IBPS Clerk 2020: ప్రభుత్వ బ్యాంకుల్లో 1557 క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

నాన‌క్‌రామ్ గూడ‌‌కు చెందిన ఓ యువ‌తి ఉద్యోగం కోసం మార్చి నెల‌లో నౌక‌రీ జాబ్ పోర్ట‌ల్‌లో త‌న ప్రొఫైల్ అప్‌డేట్ చేసింది. ఆమెకు కెరీర్ స్టైల్ అనే క‌న్స‌ల్టెన్సీ నుంచి ఏప్రిల్‌లో రిష‌బ్ అనే వ్యక్తి కాల్ చేశాడు. ప్ర‌ముఖ ఎమ్ఎన్సీల‌లో ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఇందుకోసం రిజిస్ర్టేష‌న్ ఫీజు చెల్లించాల‌ని చెప్ప‌గా ఆమె కొంత డ‌బ్బు చెల్లించింది. త‌రువాత డెలాయిట్ కంపెనీ నుంచి ఉద్యోగ అవ‌కాశం వ‌చ్చింద‌ని రిష‌బ్ ఆమెతో చెప్పాడు. ఆ కంపెనీ నుంచి మాట్లాడుతున్న‌ట్టుగా వైభ‌వ్ అనే వ్య‌క్తితో ఫోన్‌లోనే ఇంట‌ర్యూ చేయించాడు. ఉద్యోగానికి ఎంపికైన‌ట్టు, ప్రాసెసింగ్ ఫీజు కింద మ‌రింత డ‌బ్బు చెల్లించాల‌ని చెప్పి, రూ.14,50,000 త‌న ఖాతాకు మ‌ళ్లించుకున్నాడు.

SBI Jobs: ఎస్‌బీఐలో 14,000 ఉద్యోగాలు... నాలుగు నెలల్లో భర్తీ

Anganwadi Jobs: రంగారెడ్డి జిల్లాలో 232 అంగన్వాడీ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

జులై 22న వైభ‌వ్ నుంచి మ‌రోసారి యువ‌తికి ఫోన్ వ‌చ్చింది. త‌మ కంపెనీలో అదే ఉద్యోగానికి ఓ వ్య‌క్తి రూ.24ల‌క్ష‌లు చెల్లించాడ‌ని, ఉద్యోగం కావాలంటే నువ్వు కూడా అంత డ‌బ్బు ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆమె అలానే చేసింది. కెరీర్‌సైట్ వెబ్‌సైట్‌, రోజ‌ర్‌పే నుంచి డ‌బ్బు చెల్లించిందామె. రిష‌బ్‌, వైభ‌వ్ ఇద్ద‌రూ ఆ యువ‌తికి ప‌లుమార్లు ఫోన్ చేసి డ‌బ్బు చెల్లించాల‌ని చెప్పారు. ఉద్యోగం వ‌స్తుంద‌నే ఆశ‌తో ఆ యువ‌తి ఆగ‌స్టు 21 నాటికి మొత్తం రూ.38,18,000 చెల్లించింది. ఆ త‌రువాత వారి నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో మోస‌పోయిన‌ట్టు తెలుసుకుని పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. సైబ‌ర్ క్రైమ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగాల కోసం జాబ్ పోర్ట‌ళ్ల‌లో వివ‌రాలు ఇచ్చే నిరుద్యోగుల‌కు పోలీసులు కొన్ని సలహాలు, సూచ‌న‌లు ఇస్తున్నారు. అన్ ఆథ‌రైజ్‌డ్ వెబ్‌సైట్లలో, క‌న్స‌ల్టెన్సీల‌కు డ‌బ్బు చెల్లించ‌కూడ‌ద‌ని, ఉద్యోగం రాక‌పోతే డ‌బ్బు తిరిగి చెల్లిస్తామ‌ని చెప్పే మాట‌ల‌ను న‌మ్మొద్ద‌ని చెబుతున్నారు.
Published by: Santhosh Kumar S
First published: September 9, 2020, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading