దిశా హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దిశాకు న్యాయం జరిగిందని దేశం నలుమూలల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. దాంతో శభాష్ సజ్జనార్, దటీజ్ సజ్జనార్.. అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి.
ఐతే గతంలో వరంగల్లోనూ ఇలాగే ఎన్కౌంటర్ జరిగింది. అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన నిందితులను చంపేశారు. ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లాలో స్పప్నిక, ప్రణీతపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న స్వప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్తో దాడి చేశాడు. అతడికి మరో ఇద్దరు సహకరించారు. 2008 డిసెంబరు 10న జరిగింది. ఐతే ఆ ఘటనలో ముగ్గురు నిందితులనూ పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. దీని వెనక కూడా సజ్జనారే ఉన్నారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా ఉన్నారు.
ఇక ఇప్పుడు కూడా దిశా హత్య కేసు నిందితులను ఎన్కౌంటర్ చేశారు. దిశా హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద ఎన్కౌంటర్ చేసి చంపేశారు. దిశను చటాన్ పల్లి సమీపంలో తగులబెట్టిన చోటుకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. తుపాకులను లాక్కోవడం సాధ్యం కాకపోవడంతో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అందుకే కాల్పులు జరిపామని తెలిపారు. ఎన్కౌంటర్లో నిందితులు అరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్ నలుగురూ చనిపోయారని వెల్లడించారు.
It’s the Great news for all of us. No more Tarikh pe Tarikh.#hyderabadpolice has done a fantastic job 🙏. Salute to this man V. C Sajjanar IPS. 👏 who has done this #Encounter. The real Hero of 1.3 billions people. #DishaCasepic.twitter.com/w0p59Ixo6u
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.