Andhra Pradesh: స్మార్ట్ ఫోన్ వాడే అమ్మాయిలే టార్గెట్.. వ్యక్తిగత విషయాలతో బ్లాక్ మెయిల్

అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు..

సైబర్ నేరగాళ్లు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీలో అప్ డేట్ అవుతూ.. అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు.. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్న పోలీసులు..

  • Share this:
    స్మార్ట్ ఫోన్ తో అమ్మాయిలకు కొత్త ఇబ్బందులు తప్పడం లేదు. పొరపాటున ఇంట్లో వాళ్లకు తెలియకుండా బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడినా.. వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఏవైనా ఫోన్ లో దాచుకున్నా అంతే సంగతులు.. ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలు ఫోన్ లో సీక్రెట్ గా పెట్టుకుంటే కష్టాలు తప్పడం లేదు. పెళ్లైన ఆడవాళ్లను వదలడం లేదు. భర్తకు తెలియకుండా దాచే సీక్రెట్లను బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టెక్నాలజీ ఎంత వేగంగా పరుగులు పెడుతుంటే.. అంతే వేగంగా సైబర్ నేరగాళ్లు కూడా అప్డేట్ అవుతున్నారు. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు వాడే ఫోన్ నెంబర్ లు.. ఓటీపీలు, పాస్ వర్డ్ లు ఏదో ఒక మాయమాటల చెప్పి తెలుసుకుంటున్నారు. ఒకసారి వారిని నమ్మి ఆ డిటైల్స్ చెబితే.. ఇక వ్యక్తిగత విషయాలతో వారిని బెదిరిస్తున్నారు. ఇటీవల ఇలాంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి.

    సైబర్ నేరాలకు చెక్ పెడుతున్నామని చెపుతున్న పోలీసులకు కొత్త సవాల్ విసురుస్తున్నారు నేరగాళ్లు. బ్యాంకు వివరాలు అంటూ కాల్స్ రావడమే ఆలస్యం.. డబ్బులు కట్ అయిపోతున్నాయంటూ వచ్చే కేసుల సంఖ్య పెరిగిపోతుంది. మరోవైపు మీకు లాటరీ వచ్చిందంటూ ఫోన్ చేసి తీరా వచ్చాక పాలసీలు, డిపాజిట్లు చెల్లించాలి అంటూ డబ్బులు వసూలు చేసే ముఠాలు అధికమయ్యాయాయి. ఇందులో చదువుకున్న వారు కూడా లేకపోలేదు. పెద్ద పెద్ద కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లు కొట్టేస్తున్నారు. మీ సిప్ పని చేయడం లేదని.. మీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. కార్డులు పని చేయడం లేదని.. వెంటనే ఓటీపీ చెప్పాలని.. లేదా ఎనీ డెస్క్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిస్టాల్ చేయాలని చెబుతున్నారు. అదే నిజమే అని నమ్మితే.. వేధింపులకు దిగుతున్నారు.

    ముఖ్యంగా ఫోన్ ఎక్కడైనా పొగొట్టుకున్నా.. లేదా దొంగతానానికి గురైనా.. సెకెండ్ హ్యాండ్ పోనే కది అమ్మేసినా.. అలాంటి అమ్మాయిలకు ఎక్కువ కష్టాలు తప్పడం లేదని తెలుస్తోంది. అందులో సమాచారంతో బ్లాక్ మెయిల్  కు దిగుతున్నారు కొందరు. వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు.

    ముఖ్యంగా గత కొద్దిరోజులుగా విశాఖ నగరవాసులపై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు. రాష్ట్రంలోని ఎక్కడ లేని విధంగా విశాఖంలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వ్యక్తిగత వివరాలు సేకరించి.. వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అలాంటి పరిస్థితి ఎదురైతే.. భయపడకుండా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: