(K.Veeranna,News18,Medak)
మోసగాళ్లు ఇప్పుడు ముసుగులు వేసుకునే పని లేకుండా జనాన్ని నిండా ముంచుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా(Social media)లో పరిచయాలు పెరిగిన తర్వాత...ఈతరహా మోసాలు మరింత పెరిగాయి. మెదక్(Medak)జిల్లాకు చెందిన ఓ యువతిని ఆమె ఫ్రెండ్ సోషల్ మీడియా అకౌంట్‌ని హ్యాక్ చేసి చాటింగ్ చేశాడు. బిట్ కాయిన్స్ (Bitcoins)లో 50వేలు పెట్టుబడి పెడితే నాలుగు లక్షలు వస్తాయని చెప్పడంతో సైబర్ నేరగాడు(cyber criminal) పంపిన ఇన్ ఐడీకి బాధితురాలు మొదట 50వేలు ఆ తర్వాత 30వేలు పంపింది. ఇది జరిగిన కొద్ది సేపటికే ఇన్‌స్టా అకౌంట్(Insta account)బ్లాక్ కావడంతో షాకైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు.
సోషల్ మీడియా పేజ్ హ్యాక్ చేసి ..
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మెదీన్‌పూర్ గ్రామానికి చెందిన గడ్డం భవాని అనే యువతి స్నేహితుడి పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌ని సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. దాని ద్వారానే ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. చాటింగ్‌లో భాగంగానే భవానీకి బిట్ కాయిన్స్‌లో మనీ ఇన్వెస్ట్ చేసే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మించాడు. కేవలం 50వేలు పెట్టుబడి పెడితే గంటలో రూ.4లక్షలు వస్తాయని భవానీని నమ్మించాడు. మోసగాడి మాటలు నిజమనుకున్న భవానీ వెంటనే అతను పంపిన ఐడీకి ఫోన్ పే ద్వారా 50వేల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే డబ్బులు రిటన్ రావాలంటే మరో రూ.30వేలు పంపాలని చెప్పడంతో అమాయకంగా మరో 30 వేలు పంపించింది.
సైబర్ చీటర్..
సైబర్ మోసగాడు చాటింగ్‌లో చెప్పినట్లు చేసిన బాధితురాలు గంట సమయం వరకు నాలుగు లక్షల రూపాయల కోసం ఆశగా ఎదురుచూసింది. గంట తర్వాత ఇన్‌స్టా అకౌంట్ చెక్ చేయడంతో అకౌంట్ బ్లాక్ అయింది. వెంటనే ఇన్‌స్టా అకౌంట్ కలిగిన తన స్నేహితుడికి ఫోన్ చేసి డబ్బులు అడగటంతో షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని తన ఇన్‌స్టా అకౌంట్ రెండు నెలల క్రితమే హ్యాక్ అయిందని తాను దాన్ని వాడటం లేదని చెప్పడంతో భవానీ ఖంగుతింది. వెంటనే నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు బాధితురాలు పోగొట్టుకున్న రూ.80వేల రూపాయలు ఫ్రీజ్. కేసు నమోదు చేసుని పోయిన డబ్బును రికవరీ చేస్తామని పోలీసు కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడిన వాళ్లు చెప్పినట్లుగా చేయవద్దని సూచించారు.
డబ్బులు ఎక్కడికి పోవన్న పోలీసులు..
అంతే కాకుండా సైబర్ మోసగాళ్ల చేతిలో ఎవరు మోసపోయినా 24గంటల్లో సైబర్ పోలీసులకు లేదంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరలో బాధితురాలి దగ్గర చీట్ చేసిన మోసగాడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి భవానీ అకౌంట్‌లో జమ చేస్తానని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబర్ నేరాలు కాజేసిన డబ్బు మొత్తం రూ.8,00,478 ఫ్రిజ్ చేసినట్లు ఆమె తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER FRAUD, Siddipeta