స్నేహం పేరుతో ద‌గ్గ‌ర‌వుతారు... రూ.ల‌క్ష‌లు కొల్ల‌గొడ‌తారు..

సైబర్ నేరస్థులు కొత్త ర‌కం మోసాల‌ను ఎంచుకుంటున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో స్నేహం పేరుతో ద‌గ్గ‌ర కావ‌డం, వారిని న‌మ్మించి అందింనంత దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మోస‌గాళ్లు ప‌నిచేస్తున్నారు. 

news18-telugu
Updated: September 17, 2020, 10:50 AM IST
స్నేహం పేరుతో ద‌గ్గ‌ర‌వుతారు... రూ.ల‌క్ష‌లు కొల్ల‌గొడ‌తారు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ నేరస్థులు కొత్త ర‌కం మోసాల‌ను ఎంచుకుంటున్నారు. సామాజిక మాధ్య‌మాల్లో స్నేహం పేరుతో ద‌గ్గ‌ర కావ‌డం, వారిని న‌మ్మించి అందింనంత దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా మోస‌గాళ్లు ప‌నిచేస్తున్నారు.  సైబ‌రాబాద్ పోలీస్ స్టేష‌న్‌కు ఇలాంటి నేరాల‌పై వ‌చ్చే ఫిర్యాదుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇటీవ‌ల న‌మోదైన ఓ కేసు వివ‌రాల‌ను పోలీసులు వెల్ల‌డించారు.

ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల‌కు ఓ వ్య‌క్తి నుంచి ఫిర్యాదు అందింది. బాధితుడి స్నేహితుడు స్వీడ‌న్‌లో ఉంటున్నాడు. వారిద్ద‌రూ త‌ర‌చూ వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. ఈ నెల ఒక‌టో తేదీన బాధితుడికి ఒక అన్‌నోన్ వాట్సాప్ నంబ‌రు నుంచి మెస్సేజ్ వ‌చ్చింది. ఆ నంబ‌రుకు ప్రొఫైల్ పిక్చ‌ర్ త‌న స్నేహితుడిది ఉండ‌టంతో, స్వీడ‌న్లో ఉన్న మిత్రుడే కొత్త నంబ‌రు నుంచి మెస్సేజ్ చేశాడేమో అనుకున్నాడు. త‌న తల్లిదండ్రులు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రిలో చేరార‌ని, అత్య‌వ‌స‌రంగా రూ.1,00,000 ఇవ్వాల‌ని అత‌డు బాధితుడిని కోరాడు. ఓ లింక్ను పంపించి దాని ద్వారా డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌మ‌ని చెప్పాడు. త‌న స్నేహితుడికి సాయం చేయాల‌నే ఉద్దేశంతో డ‌బ్బు ఇవ్వ‌డానికి బాధితుడు ఒప్పుకున్నాడు. ఆ వ్య‌క్తి పంపిన లింక్ ద్వారా, త‌న‌ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ను ఉప‌యోగించి ల‌క్ష రూపాయ‌లు చెల్లించాడు. ఆ త‌రువాత మిత్రుడికి ఫోన్ చేసి డ‌బ్బు అందిందా అని అడ‌గ్గా అస‌లు మోసం బ‌య‌ట‌ప‌డింది.

తాను అస‌లు డ‌బ్బు అడ‌గ‌లేద‌ని స్వీడ‌న్లో ఉన్న వ్య‌క్తి చెప్ప‌డంతో అవాక్క‌య్యాడు. త‌న‌కు మెస్సేజ్‌లు వ‌చ్చిన‌ కొత్త నంబ‌రుకు కాల్ చేస్తే చేరుకోలేమ‌ని చెప్పింది. దీంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ఒక వ్య‌క్తి విదేశాల్లో ఉన్న త‌న స్నేహితుడి ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టి త‌న‌ను న‌మ్మించాడ‌ని, త‌న నుంచి ల‌క్ష రూపాయ‌లు బ‌దిలీ చేయించుకున్నాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మోస‌గాళ్ల‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలుసులు వెల్ల‌డించారు.

గ‌త కొన్ని రోజుల నుంచి మోసగాళ్లు స్నేహితులు, సన్నిహితుల ప్రొఫైల్‌తో వాట్సాప్‌లో అన్‌నోన్ నంబ‌ర్ల నుంచి కాల్స్‌, మెస్సేజ్లు చేసి న‌మ్మిస్తున్నార‌ని పోలీసులు చెబుతున్నారు. అత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌ర‌ముంద‌ని చెప్పి, అమాయ‌కుల నుంచి ల‌క్ష‌ల రూపాల‌యు దండుకుంటున్నార‌న్నారు. వారి చ‌ర్య‌ల‌పై అనుమానం రాకుండా మోసగాళ్లు వేర్వేరు నంబర్ల నుంచి వాట్సాప్‌లో సన్నిహితుల ప్రొఫైల్ చిత్రంతో సందేశాలు పంపుతున్నారు. అత్య‌వ‌స‌ర‌మ‌ని చెప్పి డ‌బ్బు అడ‌గ‌డం, బాధితులు డ‌బ్బు చెల్లించిన త‌రువాత వారి కాల్స్, చాట్‌లకు స్పందించకుండా నంబ‌ర్ల‌ను బ్లాక్ చేయ‌డం, లేదా ఆ వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేయ‌డం వంటివి చేస్తున్నారు.

కొంత‌మంది కొత్త నంబ‌ర్ల నుంచి కాల్స్ చేసి, తాము ఫేస్‌బుక్ మిత్రుల‌మ‌ని న‌మ్మిస్తున్నారు. ఇలాంటి కేసు గురించి కూడా పోలీసులు వివ‌రించారు. ఒక‌ బాధితుడికి తెలియని నంబర్ల నుండి కాల్స్ వచ్చాయి. ఆ వ్య‌క్తి ఫేస్‌బుక్ మిత్రుడిన‌ని చెప్పాడు. ఆ త‌రువాత త‌న కుటుంబ స‌భ్యులు ఒక‌ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రి సిబ్బందికి చెల్లించ‌డానికి అత్య‌వ‌స‌రంగా డబ్బు చెల్లించాల‌ని బాధితుడిని న‌మ్మించి మోసం చేశాడు. డ‌బ్బు ఇచ్చిన‌ తరువాత ఫోన్ నంబ‌రు స్విచ్ ఆఫ్ చేశారు. ఇలాంటి మోసాల‌పై జాగ్ర‌త్త వ‌హించాల‌ని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు ఇస్తున్న‌ స‌ల‌హాలు

-వ్య‌క్తిగ‌త ఫోన్ నంబ‌ర్ల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌కూడ‌దు.- మీ వ్యక్తిగత సమాచారాన్ని తెలియ‌జేసే ఫోటోలు, వీడియోలను ఎవరితోనూ పంచుకోవద్దు.
-తెలియని వ్యక్తుల నుంచి, కొత్త నంబర్ల నుంచి వ‌చ్చే కాల్స్‌, మెస్సేజ్‌ల‌కు స్పందించ‌కూడ‌దు. విదేశీ నంబ‌ర్ల నుంచి వ‌చ్చే వాట్సాప్ మెస్సేజ్‌లకు స్పందించ‌కూడ‌దు.
- తెలియని బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ చేయకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.
-కొత్త‌ వ్యక్తులు పంపించే లింకుల‌పై క్లిక్ చేయవద్దు.
- తెలియని నంబ‌ర్ల నుంచి వచ్చే కాల్స్, మెస్సేజ్‌ల పట్ల జాగ్రత్త వహించండి.
-సైబ‌ర్ క్రైమ్ #సైబ‌రాబాద్ పోలీసులు #సైబ‌ర్ నేరాలు #వాట్సాప్ మోసాలు
Published by: Sumanth Kanukula
First published: September 17, 2020, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading