Home /News /crime /

CYBER FRAUDS DONT RESPOND TO SIM BLOCK MESSAGES OR CALLS THEY ARE FRAUDSTERS BE CAREFULL GH JNK

Cyber Frauds: సిమ్ కార్డు బ్లాక్ కాబోతోందని కాల్ వచ్చిందా.. అయితే జాగ్రత్త..!

సిమ్ బ్లాక్ కాల్స్‌తో జర జాగ్రత్త..

సిమ్ బ్లాక్ కాల్స్‌తో జర జాగ్రత్త..

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఫోన్ లేదా మెసేజ్ చేసి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు..

సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఫోన్ లేదా మెసేజ్ చేసి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఈ సైబర్ కేటుగాళ్ళు మరొక కొత్త స్కామ్ కి తెరలేపారు. "కేవైసీ డాక్యుమెంట్స్ లేని కారణంగా కొద్ది గంటల్లో మీ సిమ్ కార్డు బ్లాక్ కాబోతోంది. మేము చెప్పే ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఆధార్ కార్డు/పాన్ కార్డు అప్‌లోడ్ చేసి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయండి" అంటూ ఒక మెసేజ్ వస్తుంది. లేదా ఫోన్ కాల్ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకోండి అంటూ అభ్యర్థనలు వస్తాయి. అవి నిజమే అని భావించి అందులో ఉన్న స్టెప్స్ ఫాలో చేస్తే.. మీరు చాలా నష్టపోతారు.

ఈ మెసేజ్‌లు, కాల్స్ వెనుక చాలా పెద్ద స్కామ్ ఉంది. ఈ స్కామర్ల మాటలు నమ్మితే డబ్బులు పోవచ్చు లేదా మీ ఫోన్‌లోని వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లో పడొచ్చు. ప్రస్తుతం ఇటువంటి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ చాలామందికి వస్తున్నాయి. దీంతో సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) మొబైల్ వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఒక ప్రకటన జారీ చేసింది. ఈ కాల్‌లు ఫేక్ అని సీఓఏఐ స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వి(Vi)వంటి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఇటువంటి ఫోన్ కాల్స్ రావని తెలిపింది. సిమ్ కార్డు బ్లాక్ అయిందని.. కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలని వచ్చే కాల్స్, మెసేజ్‌లను అస్సలు నమ్మొద్దని సీఓఏఐ హెచ్చరించింది.

అందుకే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే.. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డీటెయిల్స్ షేర్ చేయకండి. అలాగే ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేయకండి. గుర్తుతెలియని మెసేజ్‌లను కూడా అస్సలు పట్టించుకోకండి. ఇలాంటి నేరగాళ్ళు ప్రజలను చాలా తెలివిగా మోసం చేస్తారు. ఈ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. చాలా అప్రమత్తంగా ఉండాలి.

ఈ స్కామ్ మెసేజ్‌లు సాధారణంగా మొబైల్ నంబర్ లేదా ఏదో ఒక బిజినెస్ మెసేజింగ్ ఐడి నుంచి వస్తాయి. కానీ అధికారిక మెసేజింగ్ ఛానెల్‌లు అయిన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో నుంచి రావు. అఫీషియల్ మెసేజింగ్ ఛానళ్లు మీ సర్వీస్ అప్‌డేట్‌లు, మీ బిల్లులు, రీఛార్జ్ బ్యాలెన్స్ లకు సంబంధించిన సమాచారం మాత్రమే మెసేజ్‌ల ద్వారా తెలుపుతాయి. కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఏ మొబైల్ సర్వీస్ కంపెనీ అడగదు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఈ మోసగాళ్ళ ఉచ్చులో పడి ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్తపడండి.
Published by:John Naveen Kora
First published:

Tags: Crime, Crime news, CYBER CRIME

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు