Coronavirus:పేటీఎం కేవైసీ చేస్తామని.. రూ.1.90 లక్షలు మాయం

పేటీఎం కేవైసీ పూర్తి చేస్తామని సైబర్ నేరగాళ్లు రూ.1.90 లక్షలు దొచేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. ఇద్దరు వ్యక్తులను వేర్వురుగా క్విక్ సపోర్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేయించి దోచుకున్నారు.

news18-telugu
Updated: March 29, 2020, 8:11 AM IST
Coronavirus:పేటీఎం కేవైసీ చేస్తామని.. రూ.1.90 లక్షలు మాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పేటీఎం కేవైసీ పూర్తి చేస్తామని సైబర్ క్రైమ్ మోసగాళ్లు రూ.1.90 లక్షలు దోచేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని లక్డీకాపూల్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కేవైసీ కంప్లీట్ చేసుకోవాలని ఫోన్ కాల్ వచ్చింది. అయితే స్మార్ట్ ఫోన్‌లో క్విక్ సపోర్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే కేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లు చెప్పిన విధంగానే యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. ఇన్‌స్టాల్ చేసిన అనంతరం సదరు వ్యక్తి ఖాతాలో నుంచి రూ.96 వేలు ట్రాన్స్‌ఫర్ అయినట్టు సమాచారం అందింది. దీంతో అవాక్కయిన వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలాంటి కోవకి చెందినదే మరో ఘటన వారాసిగూడలో చోటుచేసుకుంది. వారాసిగూడకు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో నుంచి ఇదే మాదిరిగా సైబర్ మోసగాళ్లు.. రూ.94వేలు దోచేశారు. ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading