సిమ్ డియాక్టివేట్ చేస్తానని నమ్మించి.. ఫోన్ పే‌ నుంచి రూ.2లక్షలు మాయం

మహానగరంలోని వనస్థలిపురానికి చెందిన వరలక్ష్మీ అనే టీచర్‌కు సిమ్ డియాక్టివేట్ చేస్తామని నమ్మించారు. అందుకోసం రూ.10ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలని సదరు టీచర్‌కు సైబర్ నేరగాళ్లు సూచించారు.

news18-telugu
Updated: May 22, 2020, 8:31 PM IST
సిమ్ డియాక్టివేట్ చేస్తానని నమ్మించి.. ఫోన్ పే‌ నుంచి రూ.2లక్షలు మాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ నేరగాళ్ల మోసాలకు అంతే లేకుండాపోతోంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ అదే స్థాయిలో మోసేపోయే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు నగదు ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా.. డబ్బును డ్రా చేసుకోవాలన్నా గంటల తరబడి బ్యాంకు ఎదుట బారులుదీరాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం సాంకేతికత పెరగడంతో మొబైల్‌లోనే అన్నీ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటు వచ్చింది. దీన్ని అవకాశంగా మల్చుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా సైబర్ మోసగాళ్లు పెద్దగా చదువుకోని వారినే కాదు.. ఉన్నత చదువులు చదివిన వారిని సైతం బురిడీ కొట్టిస్తున్నారు. అలాంటి కోవలోకి వచ్చే ఘటన ఇది. ఓ టీచర్‌ను సైబర్ నేరగాళ్లు తమ మాటలతో నమ్మించి రూ.2లక్షలు దోచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురానికి చెందిన వరలక్ష్మీ అనే టీచర్‌కు సిమ్ డియాక్టివేట్ చేస్తామని నమ్మించారు.

అందుకోసం రూ.10ను ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ చేయాలని సదరు టీచర్‌కు సైబర్ నేరగాళ్లు సూచించారు. దీంతో ఆ టీచర్ ఫోన్ పే ద్వారా రూ.10 ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ క్రమంలో వరలక్ష్మీ అకౌంట్ నుంచి రూ.2 లక్షలు కాజేశారు. ఆమె ఈ విషయం గమనించేటప్పటికీ సైబర్ నేరగాళ్ల మొబైల్ స్విఛాఫ్ చేశారు. దీంతో తాను మోసపోయానని గమనించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading