విదేశాల్లో మత బోధకుడినంటూ మహిళను ఎంత పనిచేశాడంటే..

ఇండియాలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని, పేదలకు హెల్ప్ చేసేందుకు గిఫ్ట్స్, కరెన్సీ పంపిస్తానంటూ నమ్మించాడు. తన తరపున పేదలకు సాయం చేయాలంటూ మహిళను కోరాడు.

news18-telugu
Updated: July 3, 2020, 11:36 AM IST
విదేశాల్లో మత బోధకుడినంటూ మహిళను ఎంత పనిచేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైబర్ నేరగాళ్లు కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ దోచుకోవడం వదలడం లేదు. రోజుకో కొత్త రకం మోసానికి తేర లేపుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఇంటర్ నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సైబర్ మోసాలు అధికమవుతున్నాయి. వినియోగదారులకు పెద్దగా అవగాహన లేకపోవడం.. సైబర్ నేరాల గురించి తెలియకపోవడంతో ఇంటర్ నెట్ వినియోగించే వారి జేబులు గుళ్లవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో తాను యూకెలో మత ప్రబోధకుడినంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిత్యం వాట్సప్ చాటింగ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండియాలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని, పేదలకు హెల్ప్ చేసేందుకు గిఫ్ట్స్, కరెన్సీ పంపిస్తానంటూ నమ్మించాడు.

తన తరపున పేదలకు సాయం చేయాలంటూ మహిళను కోరాడు. అందులో భాగంగానే గిఫ్ట్స్, కరెన్సీ పంపిస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మించి కస్టమ్, ఐటీ, జీఎస్టీ కట్టాలని సదరు మహిళకు చెప్పారు. ఇది నమ్మిన మహిళ రూ.11 లక్షలు చెల్లించింది. తర్వాత తాను మోసపోయానని గ్రహించిన మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరో కేసులో పలువురి నుంచి ఓటీపీ, ఓఎల్​ఎక్స్​ల పేరుతో రూ.9 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
First published: July 3, 2020, 11:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading